తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నాగ శౌర్య ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే ఈయనకు ఛలో సినిమాతో అద్భుతమైన విజయం దక్కింది. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రష్మిక మందన ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వగా ... వెంకీ కుడుముల ఈ సినిమాతోనే దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

మూవీ తో ఒక్క సారిగా నాగ శౌర్య , రష్మిక , వెంకీ కొడుముల ముగ్గురికి తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే నాగ శౌర్యసినిమా తర్వాత అనేక సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఛలో మూవీ రేంజ్ విజయాన్ని మాత్రం ఇప్పటి వరకు అందుకోలేదు. ఇకపోతే నాగ శౌర్య నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ తాజాగా విడుదల అయింది. నాగ శౌర్య తన తదుపరి మూవీ గా బ్యాడ్ బాయ్ కార్తీక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ సినిమాలో వీధి హీరోయిన్గా కనిపించనుండగా ... రామ్ దేసిన ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. హరిస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించనుండగా ... శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మధ్య కాలంలో వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్న నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ns