కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలగడమే కాకుండా నేషనల్ క్రష్ గా కూడా పేరు సంపాదించింది.. పుష్ప 2, యానిమల్ వంటి చిత్రాలతో భారీ ఆఫర్లను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. గడచిన కొద్ది రోజుల క్రితం రష్మిక జిమ్ములో వర్కౌట్ చేస్తూ ఉండగా ప్రమాదం జరిగిందని దీనివల్ల తన కాలికి కూడా గాయం అయ్యిందనే విధంగా తెలియజేసింది. దీంతో గత కొద్ది రోజులుగా ఆమె బెడ్ రెస్టు కే పరిమితమైంది.


ఇటీవలే రష్మిక షూటింగు కూడా కొంతమేరకు బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం.అయితే నిన్నటి రోజున హైదరాబాదులోని విమానాశ్రయంలో  రష్మిక వీల్ చైర్కే పరిమితమవుతూ కనిపించింది. అయితే రష్మిక అంత ఇబ్బందులలో వెళ్లడానికి ముఖ్య కారణం తాను నటించిన చిత్రం ఛావా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ తన కాలు సహకరించకున్నప్పటికీ ఆమె స్టేజ్ పైకి వెళ్లడానికి గెంతుకుంటూ వెళ్ళింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు.


కొంతమంది రష్మిక కి సపోర్ట్ చేస్తూ ఆమె డెడికేషన్ కి ఫిదా అవుతున్నామని తెలుపుతున్నారు. మరి కొంతమంది ఇంత ఇబ్బందులలో అవసరమా అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. మొత్తానికి స్టేజ్ పైకి ఇబ్బందిలతో ఎక్కిన రష్మికకు హీరో విక్కీ కౌశల్ చేయి  పట్టుకొని ఆమెను స్టేజి మీదకి పిలుచుకొని మరి నడిపించారు. రష్మిక హీరోయిన్గా ,విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఛావా చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఇందులో  భాగంగా ఇటీవలే ట్రైలర్ను కూడా విడుదల చేయగా ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: