నందమూరి నటసింహం బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్.. అందులోను ఫ్యాక్షన్ సినిమాలకు ఆయనొక బ్రాండ్ అని చెప్పొచ్చు.. ఆయన నటించిన ఫ్యాక్షన్ సినిమాలు అయిన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాలు అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అలాంటి ఫ్యాక్షన్ మోడ్ లోనే తెరకెక్కిన మరో మూవీ “ చెన్నకేశవరెడ్డి”.. బాలయ్య, స్టార్ డైరెక్టర్ వీవి వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది.. ఈ సినిమా ను బెల్లంకొండ సురేష్ గ్రాండ్ గా నిర్మించాడు..ఈ సినిమా లో బాలయ్య తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా బాలయ్య సరసన స్టార్ హీరోయిన్స్ టబు, శ్రీయా హీరోయిన్స్ గా నటించారు.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు గూస్ బంప్స్ వచ్చేలా అదిరిపోయే మ్యూజిక్ మరియు బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు..ఈ 2002 సెప్టెంబర్ 25 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది..అయితే బాలయ్య గత ఫ్యాక్షన్ సినిమాల తో పోల్చుకుంటే ఈ సినిమా ఆ స్థాయిలో అలరించలేదు.. ఈ సినిమా కోసం బాలయ్య ఎంతగానో కష్టపడ్డారు.. ఈ సినిమాలోని హెలికాఫ్టర్ సీన్స్ లో బాలయ్య డూప్ లేకుండా నటించారు.. గతం లో బాలయ్య ఫ్యాక్షన్ సినిమాలకు పరుచూరి గోపాలకృష్ణ గారు స్టోరీ, డైలాగ్స్ రైటర్ గా పని చేసారు.. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన సోదరుడు పరుచూరి వెంకటేశ్వరరావు ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువగా వుంది అని పరుచూరి గోపాలకృష్ణ గారు కనుక ఈ సినిమా కోసం ఎక్కువగా పని చేసిఉంటే ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని దర్శకుడు వివి వినాయక్ అన్నారు…అలాగే ఈ సినిమా లో భూమిలోంచి సుమోలు లేవడం ఒరిజినల్ గా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.. చెన్నకేశవరెడ్డి సినిమా కి ఇంకాస్త టైం ఎఫర్ట్ చేసి ఉంటే సినిమా మరింత భారీ విజయం సాధించేదని వినాయక్ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: