నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య ఈ మధ్య కాలంలో వరస పెట్టి విజయాలను అందుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా బాలకృష్ణ డాకు మహారాజు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇకపోతే బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 అనే సినిమాని రూపొందిస్తున్నారు.

మూవీ ని మరికొంత కాలం లోనే విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి అనే సినిమాలో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ 2 సినిమా తర్వాత బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణకు గోపి ఒక కథను వినిపించగా అది అద్భుతంగా నచ్చడంతో బాలకృష్ణ మరోసారి గోపి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే గోపీచంద్ బాలకృష్ణతో చేయబోయే సినిమాలో హీరోయిన్ కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్గా నటించబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2015 వ సంవత్సరం విడుదల అయిన లయన్ సినిమాలో బాలకృష్ణ , త్రిష జోడి గా నటించారు. మరి ఈ సినిమాతో వీరికి మంచి విజయం దక్కుతుందో లేదో చూడాలి. బాలకృష్ణ తాజాగా హీరో గా నటించిన డాకు మహారాజ్ సినిమా కు బాబి దర్శకత్వం వహించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ఇప్పటికే మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: