మెగాస్టార్ చిరంజీవి హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఓ మూవీ రూపొందబోతు న్న విషయం మన అందరికీ తెలి సిందే . ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలబడక పోయిన అనేక సందర్భాలలో అనిల్ రావిపూడి , చిరంజీవి తో తన నెక్స్ట్ మూవీ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లే అని మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుం ది అని చెబుతూ వస్తున్నాడు . ఇక పోతే తాజాగా అనిల్ రావిపూడి , విక్టరీ వెంకటేష్ హీరో గా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందించాడు.

మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా చిరంజీవితో తాను చేయబోయే సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... చిరంజీవి తో నేను తదుపరి సినిమా చేయబోతున్నాను. ఇప్పటి వరకు చిరంజీవి గారు అనేక జోనర్ సినిమాలలో నటించారు. నేను చిరంజీవితో చేయబోయే సినిమా ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు చేయని జోనర్ మూవీ అయి ఉంటుంది.

ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రాగానే అందరూ షాక్ అవుతారు. ఇప్పటికే నా దగ్గర ఒక చిన్న పాయింట్ ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఆ సినిమాకు సంబంధించిన మరి కొన్ని పనులు మొదలు పెట్టి ఆ తర్వాత ఆ మూవీ కి సంబంధించిన వివరాలను విడుదల చేస్తాను అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఇలా అనిల్ , చిరంజీవి సినిమా గురించి అప్డేట్ ఇవ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: