టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మికకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. రష్మిక కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఈ బ్యూటీ ఖాతాలో ఇండస్ట్రీ హిట్లు సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో రష్మిక బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ గురించి రష్మిక కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
 
పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఛావా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛావా సినిమాలో శంభాజీ భార్య ఏసుభాయిగా నటించే ఛాన్స్ రావడం నాకు దక్కిన గౌరవం అని నేను భావిస్తున్నానని ఆమె తెలిపారు. ఒక సినిమా నటిగా నాకు ఇంతకు మించి ఏం కావాలంటూ రష్మిక ప్రశ్నించారు. ఈ మూవీ తర్వత నేను సంతోషంగా రిటైర్మెంట్ ఇవ్వగలనని ఆమె కామెంట్లు చేశారు.
 
ఈ సినిమాలో దక్కిన పాత్ర అంత గొప్ప పాత్ర అని రష్మిక పేర్కొన్నారు. షూట్ సమయంలో ఎన్నోసార్లు నేను భావోద్వేగానికి గురయ్యానని రష్మిక వెల్లడించారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ నాకు దేవుడిలా కనిపిస్తున్నడని రష్మిక పేర్కొన్నారు. ఈ సినిమాలోని రోల్స్ అందరినీ ప్రభావితం చేస్తాయని ఆమె అన్నారు. మరోవైపు రష్మిక ఇటీవల గాయాల పాలైన సంగతి తెలిసిందే.
 
జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న సమయంలో ఆమె కాలికి గాయమైంది. ఛావా ట్రైలర్ ఈవెంట్ కు గాయంతోనే రష్మిక వెళ్లారు. వేదికపైకి రష్మిక నడవటానికి విక్కీ కౌశల్ సహాయం చేశారు. రష్మిక డెడికేషన్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భవిష్యత్తు సినిమాలతో సైతం రష్మిక భారీ విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రష్మిక రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. తర్వాత సినిమాలతో రష్మిక భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: