తెలుగు, తమిళ చిత్రాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించింది నటి అభినయ..ఈమెకు మాటలు రాకపోయినా కూడా తన అందంతో నటనతో ఎంతో చక్కగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. మొదటిసారిగా నాడోడిగల్  ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో నటించిన అభినయ నృత్యకారునిగా కూడా మంచి పేరు సంపాదించింది. అయితే తనకు నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలరని ప్రతిపాత్రలో కూడా నిరూపించింది. అయితే ఇటీవలే ఒక మలయాళం చిత్రం పానీలో ఒక కీలకమైన పాత్రలో నటించింది.


అయితే ఈ చిత్రంలో అభినయ లైంగిక వేధింపులకు గురయ్యే  సన్నివేశాలలో నటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో ఆమె చాలా అసభ్యకరంగా నటించిందని ఇలాంటి సన్నివేశాలలో నటించాల్సిన అవసరం ఏముంది అంటూ చాలామంది ఆమెను విమర్శించడం జరిగింది.. ఈ విషయం పైన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినయ ఇందుకు  సంబంధించి పలు విషయాలను  తెలియజేసింది. ఆ సన్నివేశం సినిమాలో చేర్చాలని నిర్ణయం తాను నటించాలనేది అది పూర్తిగా డైరెక్టర్ దే బాధ్యత అంటూ తెలిపింది. దాని గురించి తాను చెప్పడానికి ఏమీ లేదని కూడా తెలిపింది.



జోజు జార్జ్, పానీ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి ఆయన మంచి నటుడని తాను ప్రముఖ నటులు మరియు దర్శకులతో కూడా పనిచేశాను అతని పనికి చాలా అనుభవం ఉందని ఆమె తెలియజేసింది. అలాగే మలయాళ సినిమాల గురించి అభినయ మాట్లాడుతూ ఇతర భాషల చిత్రాలలో నటించడం కంటే మలయాళ చిత్రాలను నటించడం కొంతమేరకు భిన్నమైన అనుభవం వంటిది అంటు తెలియజేసింది అభినయ.. మొత్తానికి కథ డైరెక్టర్ డిమాండ్ చేయడం వల్లే తాను కొంతమేరకు అశ్లీల దృశ్యాలలో నటించాను అంటూ తెలియజేసినట్లు కనిపిస్తోంది. అభినయ నిజజీవితంలో కూడా మాట్లాడలేని వినలేని పరిస్థితిలో ఉన్నది. తన మాటలను అన్నిటినీ కూడా కేవలం సైగలతోనే తెలియజేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: