కాగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ చేయబోతున్నారు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తూ ఉండడం సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది. అలాగే కీలక పాత్రలలో అక్షయ్ కుమార్ - కాజల్ అగర్వాల్ లాంటి ప్రముఖులు కూడా నటిస్తున్నారు. కాగా రీసెంట్గా ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ ఈ సినిమాలో శివుడు పాత్రను తిరస్కరించిన ఒక పాన్ ఇండియా స్టాల్ హీరో పేరుని ఓపెన్గా బయటపెట్టారు . దీంతో సోషల్ మీడియాలో ఆయన పేరు మారు మ్రోగి పోతుంది .
ఆయన మరెవరో కాదు కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన హీరో సూర్య . కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది . ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా మంచిగా మార్కెట్ దక్కించుకుంటాయి. అయితే హీరో సూర్య అప్పటికే వేరే సినిమాలో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమాకి సంబంధించి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేను అంటూ మొహమాటం లేకుండా చెప్పేసారట. ఇదే విషయాన్ని విష్ణు బయట పెట్టడం సంచలనంగా మారింది. కాగా శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు . అయితే అక్షయ్ కుమార్ కూడా మొదట ఈ పాత్రలో నటించడానికి రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత మళ్లీ ఆయనే ఒప్పుకున్నారట..!