రాంగోపాల్ వర్మ 2018 లో ఒక చెక్ బౌన్స్ కేసు ముంబైలో నమోదు అయిందట. అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారట.. అయితే గత ఏడేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉన్నప్పటికీ.. ఈ కోర్టుకు సైతం వర్మ హాజరు కావాలని చాలా సార్లు నోటీసులు పంపించారట. అయితే వర్మ మాత్రం కోర్టుకి ఒకసారి కూడా వెళ్లలేదట. దీంతో కోర్టు సైతం వర్మ పైన ఫైర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వర్మ పైన నాన్బెయిల్ వారంటీని కూడా జారీ చేసినట్లు సమాచారం.
వచ్చే మూడు నెలలలో ఫిర్యాదు దారులకి రూ.3.72 లక్షల రూపాయలు పరిహారం చెల్లించకపోతే మూడు నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అంటూ ముంబై మెజిస్ట్రేట్ కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విషయం వర్మ కి కొంతమేరకు షాక్ అని కూడా చెప్పవచ్చు. గతంలో ఎన్నో మంచి మంచి చిత్రాలను తెరకెక్కించిన వర్మ ఈ మధ్యకాలంలో ఎలాంటి ట్విట్ చేసినా కూడా అది సస్పెన్స్ గానే అవుతున్నది. ఇప్పటికే వర్మ పైన కూడా కొన్ని కేసులు సైతం నమోదైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో వర్మ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.