- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా ‘ డాకు మహారాజ్ ’ . ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాల మ‌ధ్య లో పోటీగా రిలీజ్ అయిన డాకూ మ‌హారాజ్ మంచి స‌క్సెస్ అయ్యింది. ఈ సినిమా ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 180 కోట్ల రేంజ్ లో గ్రాస్ వ‌సూల్లు కొల్ల‌గొట్టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స్ట‌డీ గా ముందుకు వెళుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా విజ‌యోత్స‌వ వేడుకలు తాజాగా జరుపుకుంది చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్లి పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డాకూ మ‌హారాజ్ సినిమా ను తెరకెక్కించగా బాలయ్య మరోసారి తన నటవిశ్వరూపంతో ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిపాడ‌నే చెప్పాలి.


ఈ క్ర‌మంలో నే ఈ సినిమా స‌క్సెస్ వేడుక‌ల‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ ఎస్ ఎస్ .. బాల‌య్య త‌ర్వాత సినిమా ‘ అఖండ 2 ’పై అదిరిపోయే ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేశాడు. బాల‌య్య ల‌క్కీ డైరెక్ట‌ర్ .. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ‘ అఖండ 2 ’ సినిమా ని ఎలా తెరకెక్కిస్తున్నాడో తనకి తెలుసని.. ఈ సినిమా మాస్ జాతరగా ఉంటుంద‌ని ... బాలయ్య మరోసారి అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేందుకు రెడీ అయిపోయాడ‌ని .. ఇక అఖండ 2 తాండ‌వం సినిమా ఇంటర్వెల్ వరకే ఆడియెన్స్‌కు పైసా వసూల్ చేసేలా ఉంటుందని థమన్ చెప్పారు. ఇలా అఖండ 2 సినిమా పై థ‌మ‌న్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నంద‌మూరి ఫ్యాన్స్ తో పాటు బాల‌య్య అభిమానుల‌కు మాంచి కిక్ ఇస్తున్నాయ‌నే చెప్పాలి. ఇక అఖండ 2 సినిమా షూటింగ్ కంటిన్యూ గా పూర్తి చేసి ద‌స‌రాకు రిలీజ్ చేసే లా ప్లానింగ్ జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: