- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )


లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా వచ్చిన టాలీవుడ్ సినిమా ల‌లో యువ దర్శకుడు కేఎస్ ర‌వీంద్ర అలియాస్‌ కొల్లి బాబీ ... అలాగే నంద‌మూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన భారీ హిట్ సినిమా  “ డాకు మహరాజ్ ” ఒకటి. రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ - వెంక‌టేష్ సంక్రాంతికి వ‌స్తున్నాం ఈ రెండు సినిమాల‌తో పాటు డాకూ మ‌హారాజ్ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూడు సినిమాల పోటీ లో కూడా డాకూ మ‌హారాజ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న స్టామినా చాటుకుని మ‌రీ హిట్ అయ్యింది.


భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన డాకూ బాలయ్య కెరీర్ లో మరో పెద్ద హిట్ గా నిలిచి అదరగొట్టింది. అఖండ తో మొద‌లు పెట్టాక బాల‌య్య కెరీర్ లో ఇది వ‌రుస‌గా నాలుగో విజ‌యం. ఇటీవ‌ల కాలంలో బాల‌య్య కు నాలుగు వ‌రుస విజ‌యాలు అంటే సెన్షేస‌న్ రికార్డు. తాజాగా ఈ సినిమా స‌క్సెస్ మీట్ నిన్న అనంతపురంలో గ్రాండ్ గా చేయగా అక్కడ దర్శకుడు బాబీ బాల‌య్య వ్య‌క్తిత్వంపై చేసిన కామెంట్లు బాల‌య్య గౌర‌వాన్ని .. వ్య‌క్తిత్వాన్ని మ‌రింత ఇనుమ డింప‌జేశాయ‌నే చెప్పాలి.


తాను బాలయ్య గారిని కలిసిన మొదటిరోజే తన కోసం అడిగితే .. తాను చిరంజీవి గారి అభిమానిని .. ఆయ‌న వ‌ల్లే .. ఆయ‌న ఆద‌ర్శం తోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాన‌ని చెపితే .. న‌న్ను ఆప్యాయంగా ఎంక‌రేజ్ చేశార‌ని.. ఇత‌ర హీరోల ద‌గ్గ‌ర ఎవ‌రికి అయినా ఇలా జరిగిందో లేదో నాకు తెలీదు కానీ బాలయ్య వ్యక్తిత్వం చాలా గొప్పది అని ఈ విషయం ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదని బాబీ చెప్ప‌గా.. ఈ కామెంట్స్ ఇప్పుడు నంద‌మూరి అభిమానుల తో పాటు మెగా అభిమానుల్లోనూ వైర‌ల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: