ఒక మహిళ చనిపోయిన కారణంగా ఏకంగా పాన్ ఇండియా హీరో ని అరెస్ట్ చేయించారు. అల్లుఅర్జున్ ని జైల్లో పెట్టించి సెన్సేషనల్ గా మారిపోయాడు రేవంత్ రెడ్డి . ఆ టైంలో రేవంత్ రెడ్డి పై చాలా ప్రెజర్స్ వచ్చాయి . పెద్ద పెద్ద ప్రముఖులు సైతం అల్లు అర్జున్ కేసును వదిలేయాలి అంటూ ఫోర్స్ చేశారు . కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా నిజాయితీగల సీఎంగా వ్యవహరించారు అంటూ జనాలు ఆయన గురించి ప్రశంసిస్తూ మాట్లాడుకుంటున్నారు . తాజాగా దావుస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డికి మరొకసారి అల్లు అర్జున్ అరెస్టుపై ప్రశ్నలు ఎదురయ్యాయి . దీంతో రేవంత్ రెడ్డి చాలా నిక్కచ్చిగా స్పందించారు. " ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా..? అని రిపోర్టర్స్ ప్రశ్నించగా.. చాలా టాలెంటెడ్ ఆన్సర్ ఇచ్చారు.
"రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే పోలీసులు వద్దన్నారు.. మరి ఎందుకు థియేటర్ కి వెళ్లారు..? రోడ్ షో ఎందుకు చేశారు..? ఆయన అలా రోడ్ షో చేయడం బట్టే కదా అభిమానులు రావడం సెక్యూరిటీ అక్కడ సరిగ్గా వర్క్ చేయలేకపోయిన పరిస్థితి వచ్చింది. ఒక మనిషి చచ్చిపోతే 10 - 12 రోజుల వరకు ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు . ఇది న్యాయమేనా..? చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అంటూ ఘాటుగానే కౌంటర్ వేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాటలు పట్ల ఒక వర్గం ప్రేక్షకులు హ్యాపీగానే ఉన్న బన్ని ఫ్యాన్స్ మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు . అంతేకాదు రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే మరొకసారి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించే విధంగానే ఉన్నారు అని..అల్లు అర్జున్ పై స్పెషల్ ఫోకస్ చేశారు అంటూ మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఐటి రైట్స్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ఇంటిపై కూడా ఐటి రైడ్స్ నిర్వహించే విధంగా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు అంటూ కూడా టాక్ వినిపిస్తుంది..!