ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిక్చర్ లో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. అదేవిధంగా నదియా కాకుండా వెనకాల ఒక షాడో వ్యక్తి ఉన్నారు. మీరు గమనించారా..? ఆ వ్యక్తి ఎవరో సాదాసీదా వ్యక్తి అనుకుంటే పొరపాటు పడ్డట్టే . ఒక పెద్ద స్టార్ . పాన్ ఇండియా స్టార్ అనే చెప్పాలి . అయితే "అత్తారింటికి దారేది" సినిమాకి సంబంధించిన ఈ షాట్లో ఆ హీరో ఎలా దర్శనమిచ్చాడు ..? అనేది అందరికీ బిగ్ డౌట్ గా మారిపోయింది.  ఆ విషయం పై క్లారిటీ ఇచ్చాడు మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఓ ఇంటర్వ్యూలో దీని పై స్పందించాడు.


"అత్తారింటికి దారేది"..చాలా సింపుల్ కాన్సెప్ట్. చాలా చాలా రియలిస్టిక్ గా తెరకెక్కిన సినిమా.  "అత్తారింటికి దారేది" మూవీ పవర్ స్టార్ కెరియర్ ని మలుపు తిప్పింది.  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ ..బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి . ఈ సినిమా ఎన్నిసార్లు  చూసిన సరే చాలా చాలా న్యూ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది . ఈ సినిమా టీవీ లో వస్తే ఇప్పటికి కళ్లు ఆర్పకుండా చూసే జనాలు చాలా మందే ఉన్నారు.



కాగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కి సంబంధించిన షాట్ లో ఈ షాడో పర్సన్ కనిపిస్తారు.  ఈ షాడో పర్సన్ మరి ఎవరో కాదు "రామ్ చరణ్". మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నే ఈ షాడో పిక్చర్లో ఉన్న వ్యక్తి . ఈ క్లైమాక్స్ సన్నివేశంలో నదియా.. పవన్ కళ్యాణ్ తో "ఫోన్ చేయరా గౌతం" అనే షాట్ ఉంటుంది . ఆ మూమెంట్ లో అక్కడికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..పవన్ కళ్యాణ్ ని కలవడానికి వస్తారు.  అనుకోకుండా షాట్లో ఆ పిక్చర్ షూట్ అవుతుంది. ఆ సమయంలో షాట్ జరుగుతూ ఉండగా ఆయన సెట్స్ బయట నిల్చుని ఫోన్ మాట్లాడుతూ ఉండే ఫ్రేమ్ లోకి చరణ్ తెలియకుండానే వచ్చేసాడు . త్రివిక్రమ్ కూడా మంచి సీన్ అంటూ క్యాప్చర్ చేసేసాడు . ఈ విషయాన్ని త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మొత్తానికి ఈ న్యూస్ ని ఇప్పుడు భలే ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: