టాలీవుడ్ ఇండస్ట్రీలో... ఓ మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన... ఓ దర్శకుడి ఆచూకీ కనిపించడం లేదట. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. వరుస విషాదాలతో పాటు.. అవకాశాల కోసం వచ్చిన నటీమణులపై దౌర్జన్యం కూడా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ దర్శకుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది..

 హైదరాబాద్ లోని మియాపూర్ లో నివాసం ఉంటున్న ఓ దర్శకుడు మిస్ అయ్యాడట. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన దర్శకుడు ఓం రమేష్ కృష్ణ... నిన్నటి నుంచి కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి.  46 సంవత్సరాలు ఉన్న ఈ తెలుగు దర్శకుడు ఓం రమేష్ కృష్ణ.. నిన్న సాయంత్రం అనగా ఇంటి నుంచి బయటకు వెళ్లారట. కానీ ఇప్పటివరకు ఆయన ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఇక చేసేదేమీ లేక... తన భర్త ఆచూకీ కనిపించడం లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓం రమేష్ కృష్ణ భార్య, కుటుంబ సభ్యులు. ప్రస్తుతం మియాపూర్ లోని ఫ్రెండ్స్ కాలనీలో ఓం రమేష్ కృష్ణ నివాసం ఉంటున్నారట. చిన్న పని పైన బయటికి వెళ్లాలని... తన భార్య శ్రీదేవికి చెప్పి బయటకు వెళ్లాడట ఓం రమేష్ కృష్ణ. అలా నిన్న సాయంత్రం చెప్పిన.. ఓం రమేష్ కృష్ణ ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదట.

 దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు ఆయన భార్య శ్రీదేవి అలాగే కుటుంబ సభ్యులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు.... దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని మీడియాకు కూడా తెలియజేశారు పోలీసులు.. అయితే దర్శకుడు ఓం రమేష్ కృష్ణ ను కిడ్నాప్ చేశారా ? లేదా స్నేహితులతో పార్టీకి వెళ్లారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: