తెలుగు చిత్ర‌ పరిశ్రమలో ఎందరో నిర్మాతలు ఉన్నారు .. వారిలో కోందరూ తమకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ చిత్ర పరిశ్రమలో ముందుకు సాగుతున్న విషయం తెలిసింది. అలాంటి నిర్మాతల్లో దివంగత డి. రామానాయుడు కూడా ఒకరు .. ఆయన నిర్మాతగా ఆయన చేసిన సినిమాలే కాకుండా ఆయన వ్యక్తిగత జీవిత పరంగా కూడా ఎందరికో ఆదర్శంగా నిలిచారు .. ఇలాంటి క్రమంలోనే మరో అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేయడానికి అయినా స్ఫూర్తితో ముందుకు సాగుతూ వస్తున్నాడు.


మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని ముందుకు వెళుతున్నారు .  అయితే ఇక్కడ నిజానికి ఒక సినిమాను మొదలు పెట్టాలంటే దానికి ఒక నిర్మాత అనేవాడు ఎంతో కీలకం .. అతను డబ్బులు పెడితేనే ఒక సినిమా ముందుకు వెళుతుంది .. లేకపోతే ఆ సినిమా ఎక్కడ వేసిన గొంగాలి అక్కడే అన్నట్టు మారుతుంది .. ఇప్పుడు దిల్ రాజు లాంటి నిర్మాత 50 సినిమాలకు పైగా తన సంస్థ నుంచి ప్రొడ్యూస్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు .  ఇక దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి ఆ సినిమా చూడవచ్చు అనే బ్రాండ్ ను టాలీవుడ్‌కు ఇచ్చాడు .  


అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమలో దిల్ రాజు లాంటి మరొక నిర్మాత రారు ఉండరు అనేది కూడా నిజం .  అలాంటి దిల్ రాజు కెరియర్ లోనే ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తీసిన కూడా కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలి భారీ నష్టాన్ని మిగిల్చిన సినిమా మాత్రం గేమ్ చేంజర్ మూవీ అని చెప్పాలి. ..ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు మూవీపై అంచనాలైతే భారీగా ఉన్నాయి .. కానీ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవటంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది .. ఆ తర్వాత ఈ ఈ సినిమాకు భారీ కలెక్షన్ అయితే రాలేదు .. దాదాపు 400 కోట్ల వరకు భారీ బడ్జెట్ తో తెర్కక్కించిన ఈ సినిమా ఇప్పుడు దిల్ రాజుకి భారీ నష్టాన్ని మిగిల్చిందనే చెప్పాలి.


అయితే ఈ సినిమాకి పోటీగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మాత్రం దిల్ రాజు కొంత సక్సెస్ బాట పట్టి కొంతవరకు రికవరీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గేమ్ చేంజర్ మిగిల్చిన నష్టం మాత్రం రికవరీ అవుతుందా ? లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి . ఇక శంకర్ లాంటి అగ్ర దర్శకుడును నమ్మి దిల్ రాజు ఈ సినిమా మీద 400 కోట్ల బడ్జెట్‌ను పెట్టినప్పటికీ అది భారీ డిజాస్టర్ గా మిగలటం అనేది ఆయన కెరియర్ లోనే మర్చిపోలేని గుణపాఠంగా మిగిలింది. ఇదే క్రమంలో దిల్ రాజు తాను చేసే సినిమాల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటాడు .. కానీ ఒక గేమ్ చేంజర్ విషయంలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయాడని చాలామంది సినీ విశ్లేషకులు సైతం వారి అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఇక మరి దిల్ రాజు రాబోయే రోజుల్లో పెద్ద దర్శకులతో చేసే సినిమాలపై ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: