పుష్ప2 సినిమా దర్శకుడు సుకుమార్ ఇంటి , ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే .. అయితే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటిపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా దిల్ రాజు నిర్మించిన సినిమా కాబట్టి .. ఆటోమేటిగ్గా అనిల్ రావిపూడి పై అధ్యాయపు పన్ను శాఖ అధికారులు ఒక కన్నేసి ఉంటారని అంతా అనుకున్నారు.


కానీ ఇప్పుడు తనపై ఎలాంటి రైడ్స్‌ జరగట్లేదని అనిల్ రావుపూడి క్లారిటీ ఇచ్చాడు .. నా మీద ఐటి రైడ్స్‌ జరగలేదు .. ఇలా వస్తున్న వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదు .. ప్రస్తుతం నేను ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా ఇంట్లో ఉన్నాను .. నా దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి .. కానీ వాటన్నిటికీ క్లియర్ గా అన్నీ ఉన్నాయి .. జీఎస్టీలు ఎప్పటికప్పుడు కడుతున్నాను .. అలాగే నా దగ్గరకు వచ్చిన ప్రసాదాన్ని కూడా నేను ఎంతో జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నాను .. అలాగే ఐటీ దాడులు జరిగే అంత ధనవంతుడిగా నేను మారలేదు.


ఇలా ఇప్పుడు తనపై వస్తున్న ఫేక్ వార్తలపై అనిల్ రావుపూడి క్లారిటీ ఇచ్చారు .. మరోవైపు వ‌రుస‌ విజయాలు ఇస్తున్నప్పటికీ టాలీవుడ్ లో ఉన్న ఇతర పెద్ద దర్శకులతో పోలిస్తే తనకు ఎందుకు రెమ్యూనరేషన్ పెంచలేదని దానిపై కూడా అనిల్ స్పందించారు .. తెలుగులో ఉన్న చాలా మంది దర్శకులతో పోలిస్తే నా రెమ్యూనరేషన్ ఎంతో తక్కువ అంటారు చాలామంది .. అయితే అలాంటివన్నీ నాకేం తెలీదు నా సినిమాకు పెట్టే బడ్జెట్ పట్టి నాకు రెమ్యూనరేషన్ ఇస్తారు .. రాబోయే రోజుల్లో పెంచుతారేమో అది నాకు తెలియదు. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి టాలీవుడ్ లో ఉన్న కొందరుకు షాక్ ఇచ్చిందని కామెంట్ ను పరోక్షంగా అనిల్ అంగీకరించాడు .. ఇక తన సినిమాకు వచ్చే కలెక్షన్ల పోస్టర్లను తాను కచ్చితంగా చెక్ చేస్తాని .. వాటిలో మహా అయితే జీఎస్టీ కలిపి కలెక్షలను బయటకు చెబుతం తప్ప అంతకుమించి అంకెలను తాము మార్చమని ఆయన అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: