ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్.. వెంకటేష్ మొదటి సినిమాకు తొలి హీరోయిన్ ఎవరు ? అంటే అందరూ టక్కున చెప్పే పేరు అందమైన ఖుష్బు .. కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్ కు జంటగా నటించింది ..అనుకోకుండా ఈ సినిమాతో వెంకటేష్  ఊహించని విధంగా చిత్ర పరిశ్రమలో అప్పటికప్పుడు ఎంట్రీ ఇచ్చాడు .. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో వెంకీ ఎదిగిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. తండ్రి ఓ పెద్ద నిర్మాత అయిన ? కొడుకు మాత్రం తనని తాను అగ్ర హీరోగా మార్చుకున్న వైనం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.


ఇప్పటివరకు వెంకటేష్ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు క్రియేట్ చేసుకున్నారు .. అయితే అలాంటి గొప్ప హీరో తో వచ్చిన ఓ అవకాశాన్ని హీరోయిన్ ఖుష్బూ చేతులారా వదులుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .. వెంకటేష్ - మీనా జంటగా రవిరాజా పినిశెట్టి తెరకెక్కించిన చంటి అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు .. ఈ సినిమాలు ఇళయరాజా అందించిన పాటలు ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్.


అలాగే ఈ సినిమా తర్వాత హీరోయిన్ మీనా కెరియర్ ఊహించని రేంజ్ కు వెళ్ళింది .. అయితే నిజానికి ముందు హీరోయిన్ పాత్రలో ఖుష్బూని తీసుకున్నారట .. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా చెప్పకు వచ్చింది .. కలియుగ పాండవులు సినిమాకు నన్ను తీసుకోవాలని వెంకటేష్ గారు సిఫార్సు చేశారు.   ఓ హిందీ సినిమాలో నన్ను చూసి ఆయన అలా చెప్పారట .. ఆ తర్వాత నాగార్జున , బాలకృష్ణ గారితో వరుస‌ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి .. అయితే అప్పటికే నేను కోలీవుడ్లో బిజీ హీరోయిన్గా ఉన్నాను.  


అంతేకాకుండా ఆ స‌య‌మంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాలని గట్టి నిర్ణయం తెరపైకి వచ్చింది .. అలాంటి సమయంలో నాకు చంటి సినిమాలో అవకాశం వచ్చింది .. కానీ అదే స‌మ‌యంలో రజనీకాంత్ , కమలహాసన్తో సినిమా చేస్తున్నాను .. ఇక దాంతో చంటి సినిమాకు డేట్లు ఇవ్వడం నాకు కుదరలేదు.  అలాగే చంటిలో నటించాలంటే మరో రెండు సినిమాలను వదులుకోవాల్సి ఉంది .. కానీ నేను ఆ ఛాన్స్ తీసుకోలేదని ఖుష్బూ చెప్పుకొచ్చారు. ఇలా రజినీకాంత్ - కమలహాసన్ కారణంగా. ఖుష్బూ చంటి సినిమా ఆఫర్ ను చేతులారా వదులుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: