అసలు విషయంలోకి వెళ్తే తాజాగా నేషనల్ మీడియాతో బంధుప్రీతి గురించి మాట్లాడారు మంచు విష్ణు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అనే విషయాన్ని అంగీకరించారు. అయితే అది డెబ్యూకి మాత్రమే ఉపయోగపడుతుందని టాలెంట్ ఉంటేనే జనాలు ఎంకరేజ్ చేస్తారని లేకపోతే ఇండస్ట్రీలో నిలబడడం కష్టమని తెలిపారు..అంతేకాకుండా తన మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా తనలో ఏదో టాలెంట్ ఉందని ఆడియన్స్ కూడా గుర్తించారని అందుకే తనని హీరోగా యాక్సెప్ట్ చేశారని అందువల్లే ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఇన్నేళ్లు కొనసాగానంటూ తెలిపారు.
ఏ ఇండస్ట్రీలో నైనా సరే నెపోటిజం అనే పదం కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది.. స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో రావడం ఈజీ అని ప్రజలు కూడా అనుకుంటూ ఉంటారు.. ఈ విషయం విన్నప్పుడు తనకి చాలా నవ్వు వస్తుందని.. బంధుప్రీతి అనేది కేవలం మొదటి సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అందులో ఎలాంటి డౌట్ కూడా లేదనీ..ఆ తర్వాత మన కష్టం మీదే ఆధారపడి ఉంటుందని తెలిపారు. మొదట రగిలే గుండెలు అనే సినిమాతో చైల్డ్ యాక్టర్ గా మొదలుపెట్టిన విష్ణు 2003లో విష్ణు సినిమాతో హీరోగా మారారు.. ఆ తర్వాత ఢీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.