ఇక ఈ మధ్య ఈ బ్యూటీ సినిమాలు చేయడం ఆపేసి.. తన హెల్త్ మీద శ్రద్ద తీసుకుంటుంది. గత కొంత కాలం కింద ఈమెకి మయోసైటిస్ బారినపడి చాలా రోజులు బెడ్ కే అంకితం అయ్యింది. చాలా చికిత్సలు తీసుకున్న తర్వాత సమంత కొలుకుంది. అయితే తాజాగా ఈ అందాల భామ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఆ పోస్ట్ లో 'నేను గత రెండు సంవత్సరాలుగా ఈ చిన్న ఆచారాన్ని అభ్యసిస్తున్నాను. ఇది నా కష్టతరమైన క్షణాలలో చాలా ఉపయోగపడింది. ఇది చాలా సరళమైనది కానీ శక్తివంతమైనది. రాయడం మీకు సహజంగా వచ్చినట్లయితే.. మీ డైరీలో ఈ రోజు ఎవరికీ థాంక్స్ చెప్పాలో, ఎందుకు థాంక్స్ చెప్పాలో రాసుకోండి. అవి పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం నిజాయితీగా ఉంటే చాలు. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి రాసి చూడండి అదే అలవాటు అయిపోతుంది. ఒకసారి అందరూ దీన్ని ట్రై చేయండి. మనలో చాలా మార్పులు వస్తాయి. ఇది నాకు గేమ్ ఛేంజర్‌గా మారింది' అని రాసుకొచ్చింది. అలాగే చివరగా ఇది మీకు ఎలా వెళ్తుందో నాకు చెప్పండి. ఈ రోజు మీరు దేనికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు..? అని అడుగుతూ హీరోయిన్ సమంత తన పోస్ట్ ని పెట్టింది.