మహేష్ - రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా చోప్రాని కన్ఫామ్ చేశారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. ఇప్పుడు ఆ వార్తలు నిజం చేస్తూ ప్రియాంక హైదరాబాదులో ప్రత్యక్షమైంది .. రాజమౌళి టీంకు ప్రియాంక లుక్ టెస్ట్ కూడా ఇచ్చిందని ప‌లు వార్తలు బయటికి వస్తున్నాయి .. ఇక ప్రియాంక హీరోయిన్గా కన్ఫామ్ అవటం దాదాపు ఫిక్స్ అయిందట .. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం ప్రియాంక చేతుల్లో కూడా ఉంది .. ఎందుకంటే రాజమౌళి ప్రియాంకను బల్క్ డేట్లు అడుగుతున్నారట .


ఒక సంవత్సరం పాటు ఒకే సినిమాకు డేట్లు ఇవ్వటం ప్రియాంక లాంటి స్టార్ హీరోయిన్లకు ఎంతో కష్టమైన విషయం .. పైగా ప్రియాంక ఇప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ అంటూ తెగ సినిమాలు చేస్తుంది .. అలాగే హాలీవుడ్ లో వరుస‌ సినిమాలపై ఫోకస్ పెట్టింది .. ఈ క్రమంలో రాజమౌళి సినిమాకు వరుసగా డేట్లు ఇస్తుందా, లేదా ? అనేది ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా మారింది . రాజమౌళితో సినిమా అంటే ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో ఉంది .. మహేష్ సినిమాని కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో తెర్కక్కించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు రాజమౌళి .. ఇలాంటి సమయంలో ప్రియాంక పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితి కూడా లేదు .. కాకపోతే ప్రియంక ఇంతకన్నా ముందు కొన్ని సినిమాలకు డేట్లు ఇస్తే మాత్రం ఇబ్బంది రావడం మాత్రం పక్కా.


ఒక్క హీరోయిన్ ప్రియాంక మాత్రమే కాదు .. ఈ సినిమాల్లో నటించే నటీనటులు అందరి డేట్లు రాజమౌళి ఎక్కువగానే అడుగుతున్నట్టు తెలుస్తుంది .. కాకపోతే ఇక్కడ ఒకే సమస్య వచ్చి పడింది .. మహేష్ - రాజమౌళి సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ ఇంకా కన్ఫామ్ కాలేదు .. అవి ఓకే అయితే ఈ డేట్ ల విషయంలో ఒక క్లారిటీ కూడా రానుంది.  మరోవైపు రాజమౌళిసినిమా ప్రీ ప్రొడక్షన్ ని కూడా ఎంతో పకడ్బందీగా ముందుకు తీసుకు వెళ్తున్నాడు .. అలాగే ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాపులు కూడా ఎంతో ప్లానింగ్ తో జరుగుతున్నాయి .. ఈనెల చివర్లో   మరో కొత్త షెడ్యూల్ మొదలై అవకాశం కూడా ఉంది .. హైదరాబాద్ దగ్గరలో ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ ను వేశారు అక్కడే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలయ్యి అవకాశం ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: