బాలయ్య సీనియర్ హీరోనే అయినప్పటికీ ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడు . బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నారు . ఆయన నటించిన సినిమాలకు 100 కోట్లు కలెక్ట్ అయ్యే విధంగా సినిమాలో పెర్ఫార్మన్స్ ఇస్తూ ఉండటం కూడా హైలెట్ అనే చెప్పాలి . మరి ముఖ్యంగా అఖండ సినిమా తర్వాత బాలయ్య నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుంది . అఖండ .. ఆ తర్వాత నటించిన వీర సింహారెడ్డి .. ఆ తర్వాత నటించిన భగవంత్ కేసరి .. నిన్నకాకమున్న రిలీజ్ అయిన "డాకు మహారాజ్".. ఇలా బ్యాక్ టు బ్యాక్ నాలుగు సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేశాడు బాలయ్య.


కాగా ప్రజెంట్ అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు బాలయ్య. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై జనాలు ఓ రేంజ్ లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.  నో డౌట్ ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. బాలయ్య బోయపాటి కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాలా. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా తర్వాత బాలయ్య ఎవరి దర్శకత్వంలో నటించబోతున్నాడు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.



కాగా రీసెంట్ గా దీనికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..బాలయ్య తన నెక్స్ట్ సినిమాను డైరెక్టర్ వశిష్టతతో కమిట్ అయ్యాడట . ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఆల్రెడీ వశిష్ట ..మెగాస్టార్ చిరంజీవితో "విశ్వంభర"  సినిమాని తెరకెక్కించారు. సమ్మర్ కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది . అయితే ఈ మూవీ తర్వాత వశిష్ట బాలయ్యకు తన ఫుల్ కమిట్మెంట్ ఇచ్చేసాడట. బాలయ్య కూడా వశిష్ట కథ విని ఫుల్ ఇంప్రెస్ అయిపోయారట . అసలు బాలయ్య విశిష్ట కాంబోలో ఒక సినిమా వస్తుంది అని జనాలు అసలు ఊహించలేకపోయారు . ఇలాంటి ఒక క్రేజీ కాంబోలో సినిమా రాబోతుంది అని తెలియడంతో జనాలు ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: