తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (FDC) చైర్మన్‌, టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట్లో సోదాలు సోదాలు జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఆయన ఇంట్లో ఐటీ అధికారులు రైడ్ నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటితో పాటుగా ప్రొడక్షన్ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఆఫీసుపై కూడా సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు సంస్థయే కాదు.. పుష్ప 2 ప్రొడక్షన్ సంస్థ, అలాగే మ్యాంగో వీడియో, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపైన కూడా రైడ్ జరుగుతుంది.    
అయితే దిల్ రాజు ఇంట్లో జరుగుతున్న సోదాలపై టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ స్పందించారు. ఇటీవల రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. దిల్ రాజు ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ విషయంపై డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా స్పందించారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. దిల్ రాజు ఇంట్లోనే కాదు చాలా మంది టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఐటీ దాడులు నిర్వహించడం జరుగుతుందని.. అది సాధారణమైన విషయమని అనిల్ తెలిపారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత దిల్‌రాజును తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్లు కొనసాగానున్నారు. ఆయన 1990లో 'పెళ్లి పందిరి’ సినిమాలో పంపిణీదారుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం దిల్ రాజు ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మించి విజయం సాధించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న దిల్‌రాజు పేరు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: