వివరాల్లోకి వెళితే, సైఫ్ తన ఇంట్లో ఉండగా, మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే 30 ఏళ్ల దుండగుడు ఇంట్లోకి చొరబడి, సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భజన్ సింగ్ రానా, సైఫ్‌ను తన ఆటోలో దగ్గరలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సైఫ్‌కు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సైఫ్‌ను ఆసుపత్రికి తరలించడంలో భజన్ సింగ్ రానా చూపించిన చొరవను అందరూ మెచ్చుకుంటున్నారు.
భజన్ సింగ్ రానా చేసిన సాహసాన్ని కొనియాడుతూ మీకా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. "భారతదేశం గర్వించదగ్గ సూపర్ స్టార్‌ని కాపాడిన రానాకు కనీసం 1 లక్ష రూపాయలు రివార్డు ఇవ్వాలి. అతని చర్య నిజంగా అభినందనీయం" అని మీకా పేర్కొన్నారు. అంతేకాదు, రానాను స్వయంగా కలిసి రివార్డు ఇవ్వడానికి ఆయన వివరాలను పంచుకోవాల్సిందిగా కోరారు.
ఇదిలా ఉంటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ స్వయంగా భజన్ సింగ్ రానాను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రానాను ఆప్యాయంగా హత్తుకొని, ధన్యవాదాలు తెలిపారు. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ కూడా రానా ధైర్యానికి, సమయస్ఫూర్తికి ఆశీర్వదించారు.
జనవరి 19న ముంబై పోలీసులు షెహజాద్‌ను థానేలో నిందితుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి 5 రోజుల పోలీస్ కస్టడీకి పంపించారు. ఈ ఘటనలో భజన్ సింగ్ రానా చూపించిన తెగువ, నిస్వార్థ సేవకు సైఫ్ కుటుంబం, ఫ్యాన్స్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీకా సింగ్ ప్రకటించిన రివార్డు, అత్యవసర పరిస్థితుల్లో ఇతరులకు సహాయం చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. భజన్ సింగ్ రానా నిజంగానే రియల్ హీరో అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.