టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వరుస గా పలు పాన్ ఇండియా సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. టాలీవుడ్ లో చాలా తక్కువ టైంలోనే తిరుగులేని పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ రాజు క్రేజ్ తెచ్చుకున్నారు. బాహుబలి 1 - బాహుబలి 2 సినిమాలతో ప్రభాస్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ తర్వాత సాహో - రాధేశ్యామ్ - ఆది పురుష్ - కల్కి సినిమాలు ప్రభాస్ ఇమేజ్ను శిఖరాగ్రా న నిలబెట్టేసాయి. ప్రస్తుతం ప్రభాస్ .. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత ప్రభాస్ సలార్ 2 సినిమా చేస్తాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. స్పిరిట్ సినిమా గురించి ఓ ఇంట్రెస్ టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించనున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వరుణ్ తేజ్ పై ఇప్పటికే షూట్ టెస్ట్ కూడా జరిగిందని అంటున్నారు. ఏదేమైనా ప్రభాస్ పాన్ ఇండియా సినిమా లో మెగా హీరో వరుణ్ తేజ్ విలన్ గా చేయడం అంటే వరుణ్ క్రేజ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగడం ఖాయం. అసలు వరుణ్ తేజ్ ఇటీవల కాలం లో హీరోగా చేసిన సినిమాలు అన్నీ వరుస పెట్టి ప్లాపులు అవుతున్నాయి. ఈ టైంలో వరుణ్ తేజ్ రూటు మార్చి హీరో నుంచి విలన్ గా అవతారం ఎత్తితే కచ్చితంగా మరో జగపతి బాబులా మారే ఛాన్సులు ఉన్నాయి.