రెండు రాష్ట్రాలు ప్రేక్షకులకు సింగర్ మధుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన పాటలతో ఎంతోమంది అలరించిన ఈమె తాజాగా హిందువులు ఆగ్రహానికి గురయ్యాల ఒక పని చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పలువురు రాజకీయ నాయకులకు కూడా ఈమెను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారట. మరి ఇంతకు సింగర్ మధుప్రియ అంతగా ఏం చేసింది? వాటి గురించి పూర్తిగా చూద్దాం.?


ప్రస్తుతం సింగర్ మధుప్రియ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఉన్నది. తాజాగా ఒక ప్రైవేటు ఆల్బమ్ సాంగ్ భూపాలపల్లి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో పాటను షూటింగ్ చేయడం జరిగిందట. అయితే అవి కూడా అక్కడికి భక్తులు రాకుండా దర్శనానికి రాకుండా గుడి తలుపులు మూసేసి మరి గర్భగుడిలో సాంగుని సైతం షూటింగ్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ స్థానికులతో పాటు చాలామంది హిందువులు కూడా మధుప్రియను విమర్శిస్తున్నారు. అసలు నీకు గర్భగుడిలో సాంగ్ తీయమని ఎవరు అనుమతి ఇచ్చారు అంటూ అటు బిజెపి నాయకులతో పాటు హిందువులు సైతం ప్రశ్నిస్తున్నారు? వెంటనే ఈమెను అరెస్టు చేయాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారట.


దేవాలయాలలో ఫోటోలు తీయడానికి అనుమతి లేనప్పుడు గర్భగుడిలోకి వెళ్లి ఫోటోలు ఎలా తీస్తున్నారు.. అసలు ఆలయ అధికారులు మనోభావాలను దెబ్బతీసేలా చేశారంటూ మండిపడుతున్నారు.కాలేశ్వర ముక్తేశ్వర ఆలయంలో వీడియోలు ఫోటోలు తీయడం నిషేధమని అలాంటిది మధుప్రియ తన బృందంతో కలిసి ఏకంగా గర్భగుడిలోకి వెళ్లి పాటలను చిత్రీకరించడంతో ఈమె పైన తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి.. కానీ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి ఈమె అనుమతి తీసుకున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతున్నప్పటికీ మరి కొంత మంది మాత్రం ఆలయ సిబ్బందిని ఒప్పించే ఈ పాటను చిత్రీకరించారని తెలుపుతున్నారు. మరి ఈ విషయం పైన అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: