టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం గాంధీ తాత చెట్టు.. ఈ చిత్రాన్ని ఇప్పటికే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో కూడా ప్రదర్శించబడిందట.ఎన్నో అవార్డులను కూడా అందుకున్నదట. బాలనటిగా కూడా సుకృతి తన అద్భుతమైన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఈ సినిమాకి కొంతమేరకు హైట్ ఏర్పడింది. రేపటి రోజున ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా తాజాగా మీడియా కోసం స్పెషల్ షో వేయక ఈ సినిమా రివ్యూ వైరల్ గా మారుతున్నది.


సినిమా స్టోరీ విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందినటువంటి రామచంద్రయ్యకు 15 ఎకరాలు భూమి ఉంటుంది. తన తండ్రి ఆస్తి నుంచి వచ్చిన భూమితో పాటుగా అక్కడే ఒక వేప చెట్టు కూడా ఉంటుందట.. రామచంద్రయ్యకు తన మనవరాలుగాంధీ (సుకృతి) అంటే చాలా ఇష్టమని చిన్నప్పటినుంచి తన తాత చెప్పేటువంటి కథలను విని పెరిగింది. అయితే అదే ఊరిలో స్థానికంగా మంత్రి చేసేటువంటి కుట్ర కారణంగా అదే ఊరిలో ఒక పెద్ద చెరుకు ఫ్యాక్టరీ మూతపడుతుందట .దీనివల్ల రైతులందరూ కూడా అప్పులు పాలవుతారు. ఆ తర్వాత అదే ఊర్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించి రైతులకు ఉపాధి కల్పిస్తానంటూ మభ్యపెడతారు. రైతులందరూ కూడా డబ్బులు ఎక్కువ వస్తాయని పండే పంట భూమిని వారికి అమ్మేస్తారు. కానీ రామచంద్రయ్య మాత్రం తన పొలాన్ని అమ్మరు.అయితే చివరికి అలా ఇంట్లో గొడవలు కావడం చేత రామచంద్రయ్య మరణిస్తారు. మరి చెట్టును కాపాడడం కోసం మనవరాలు(గాంధీ) ఏం చేసిందనేది సినిమా కథ.


ఇందులో గాంధీ సిద్ధాంతాలు బాటను అనుసరిస్తూ ఒక 13 ఏళ్ల అమ్మాయి ఆ చెట్టుని కాపాడడం కోసం తన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది అన్నదే సినిమా కథలు హైలైట్ అట.. ఈ సినిమా స్టోరీ గాంధీ తాత, చెట్టు ,అమ్మాయి చుట్టూనే తిరుగుతూ ఉంటుందట. ఇందులో సందేశం బాగున్నదని సాగదీతగా అనిపించిన మొక్కల ప్రాధాన్యత గురించి అద్భుతంగా చూపించారని తెలిపారు. ఒకపక్క గాంధీ తాత జర్నీను చూపిస్తూ తాత, చెట్టు, మనవరాలకు ఉన్న అనుబంధాన్ని చూపించారట.. ఫస్టాఫ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ సాగినప్పటికీ రెండో భాగం కొంతమేరకు సాగదీసినట్లుగా కనిపిస్తోందట. కథలో ట్విస్టులు లేకుండా ఊహకు అందినట్టుగానే సాగుతుందట."చెడుని దులిపేయాలి మంచిని పట్టుకోవాలి" అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


సుకుమార్ కూతురు సుకృతి డబ్ల్యూ మూవీ అయినప్పటికీ తన మొదటి చిత్రంతోనే అందరిని ఆకట్టుకుంది. గాంధీ పాత్రలో కూడా ఒదిగిపోయి మరి నటించిందట. గాంధీ పాత్ర కోసం సుకృతి నిజంగానే గుండు గీయించుకున్నదని తెలుస్తోంది. అలాగే రామచంద్రయ్య పాత్రకి ఆనంద్ చక్రపాణి న్యాయం చేశారని తెలుపుతున్నారు. మొత్తానికి సెకండ్ హాఫ్ లు కొన్ని సన్నివేశాలు మైనస్ తప్ప మిగిలినవంతా బాగుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: