తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ సెలబ్రిటీకి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ఆ విధమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు జ్యోతిష్కుడు వేణు స్వామి.. సినీ రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ  ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యారు. అయితే చాలామంది జాతకాల్లో ఆయన చెప్పిన విధంగా జరగడంతో వేణుస్వామి అంటే అందరికీ నమ్మకం కలిగింది. అంతేకాకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు వారి కెరియర్ గాడిలో పడేందుకు వేణు స్వామి ద్వారా పూజలు చేయించుకున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్మిక మందాన. ఈమె వేణు స్వామి దగ్గర పూజ చేయించుకున్న తర్వాత లైఫ్ ఈ టర్న్ అయిందని చెప్పవచ్చు. ఇక వీళ్లే కాకుండా ఇండస్ట్రీలో ఒక ఫేమస్ జంట విడిపోతారని ఆయన అప్పట్లో చెప్పారు. వాళ్లే సమంత నాగచైతన్య. 

ఆయన చెప్పినట్లుగానే వారు విడాకులు తీసుకుని దూరమయ్యారు.. ఇదే కాకుండా పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలను కూడా చెబుతూ ఆయన మంచి క్రేజ్ సంపాదించారు. అలాంటి వేణు స్వామి గత ఎన్నికలకు ముందు  తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ గద్దెనెక్కుతాడని చెప్పారు. ఏపీలో జగన్ గెలుస్తాడని చెప్పాడు. కానీ ఈ రెండు తారు మారు కావడంతో  వేణుస్వామి పరిస్థితి గుడితిలో పడ్డ ఎలుకల తయారైంది. చివరికి ఆయన జతకాలు మానేసి సైలెంటుగా కూర్చోమని  చాలామంది నిందించారు. అలా కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న వేణుస్వామి మళ్లీ దూసుకొస్తున్నారు.

నాగచైతన్య, శోభిత దూళిపాళను పెళ్లి చేసుకున్న సమయంలో వారి పెళ్లిపై ఆయన కామెంట్లు చేశాడు.. దీంతో ఇది మహిళా కమిషన్ వరకు వెళ్ళింది. తాజాగా  పుష్ప2 దర్శకుడు  సుకుమార్ మరియు హీరో అల్లు అర్జున్ జాతకాలు కూడా చెప్పారు. వీరిద్దరూ ఒక దగ్గర ఉంటే శని ఎక్కువగా ఉంటుందని, వీరిద్దరి వల్ల వారి పక్కన ఉన్న వారికి కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే సుకుమార్ అల్లు అర్జున్ మధ్య దారుణమైన గొడవలు ఏర్పడతాయని ఆయన చెప్పడంతో అదికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: