గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్ ను షేక్‌ చేస్తున్న ఐటీ రైడ్స్‌ గురించి అందరికీ తెలిసిందే .. ఈ ఇప్పటివరకు కేవలం నిర్మాతలు దర్శకుల పైన మాత్రమే ఆదాయపు పన్ను వారు ఫోకస్ చేశారు.  వీరితోపాటు కొంతమంది నిర్మాతలకు ఫైనాన్సు ఇచ్చిన ఫైనాన్సర్లపై కూడా ఐటి దాడులు జరిగాయి .. మొత్తంగా 55 మంది అధికారులు బృందాలుగా విడిపోయి ఒకేసారి అదయపు ప‌న్ను వారు అన్నిచోటల సాధాలు నిర్వహిస్తున్నారు .. కేవలం టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లోనే మూడు రోజుల నుంచి అధికారులు బయటికి రాకుండా సోదాలు చేస్తున్నారు .. ఈ అధికారులు ఎంత సీరియస్ గా ఈ రైడ్స్‌ చేస్తున్నారో అందరూ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు .. ఇప్పుడు ఇదంతా పక్కనపడితే రాబోయే మరో మూడు రోజుల్లో ఐటి అధికారులు మన టాలీవుడ్ అగ్ర హీరోల ఇంటిపై కూడా దాడులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తాజాగా పలు వార్తలు బయటికి వస్తున్నాయి .. అధికారులు దాడు చేసే స్టార్ హీరోలు ఎవరంటే .. ప్రభాస్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ పేరులు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
 

ప్రజెంట్ పాన్‌ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ పాపులారిటీ తెచ్చుకున్ని భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటాన   హీరోలలో టాలీవుడ్ నుంచి వచ్చిన హీరోలే ముందు వరుసలో ఉన్నారు .. పైన చెప్పిన ముగ్గురు హీరోల సినిమాలు ఈ రీసెంట్‌ టైంలో  బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు అందుకుని మంచి కలెక్షన్లు రాబట్టాయి .. అలా వచ్చిన విజయాలలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ లాభాల్లో వాటాలు తీసుకొని ఒక్కో సినిమాకు ఆయన 120 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నాడట .. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఆయన చేయబోయే సినిమాలకు కూడా వందల కోట్లలో అడ్వాన్స్ అందుకున్నారు .. కేవలం హోమబుల్ సంస్థలోనే మూడు సినిమాలు చేసేందుకు గాను ప్రభాస్ 350 కోట్లకు పైగా డీల్ సెట్ చేసుకున్నాడు .. ఇప్పుడు వీటికి సంబంధించిన సమాచారం మొత్తం ఐటీ అధికారుల వద్ద ఉండటంతో ఆయన ఇంటిపై కూడా దాడులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 

అలాగే అల్లు అర్జున్ ఇంటిపై కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగబోతున్నాయని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట .. రీసెంట్ గానే పుష్ప నిర్మాతల ఇంటిపై, దర్శకుడు సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ దాడులు నిర్వహించారు .. ఈ దాడుల్లో 531 కోట్ల రూపాయలకు పైగా లెక్కల్లో తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారట .. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రెమ్యూనరేషన్ కి బదులుగా లాభాల్లో వాటాలు అందుకున్నాడు కాబట్టి ఆయనపై కూడా ఈ దాడులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  ఇక చివరిగా ఎన్టీఆర్ పై కూడా ఈ దాడులు జరిగి అవకాశాలు ఉన్నాయట .. దేవర సినిమాకి ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాత.. ఈ సినిమాకి కూడా ఎన్టీఆర్ లాభాల్లో వాటాలు తీసుకున్నాడు .. అందుకే ఐటీ అధికారులు ఈ ముగ్గురి ఇంటిపై కూడా దాడులు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తాజా సమాచారం .. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: