సంక్రాంతి సినిమాల హడావుడి ముగిసిపోయింది .. జ‌న‌వ‌రి కూడా చివరి దశకు వచ్చేసింది .. ఇక దీంతో సంక్రాంతి సినిమాల ఫలితాలు తేలిపోయాయి .. ఇప్పుడు సినీ అభిమానులు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు కోసం ఎదురుచూస్తున్నారు .. అయితే ఇప్పుడు రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది ..ఇందులో చెప్పుకోవడానికి ఆరు డజనుకు పైగా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దకు వస్తున్నాయి .. కానీ అందులో కనీసం చెప్పుకోదగ్గ సందడి కనిపించడం లేదు. దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వెండితెరకు పరిచయమవుతున్న గాంధీతాత చెట్టుకి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ అండదండలు ఉన్నప్పటికీ సినిమాపై బజ్‌ కనిపించడం లేదు .. రిలీజ్ తర్వాత సినిమాకు అన్యోన్యంగా టాక్ వస్తే తప్ప ఓపెనింగ్స్ ని ఆశించలేం .. వైయస్ వివేకానంద రెడ్డి మర్డర్ ఆధారంగా తీసిన హత్య సినిమాను కూడా థియేటర్లోకి తీసుకురాబోతున్నారు .. పెద్ద పెద్ద నటులు ఉండడం కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడింది.
 

మలయాళ స్టార్ నటుడు టోవినో థామస్ , స్టార్ హీరోయిన్ త్రిష జంట‌గా న‌టించిన మలయాళ డబ్బింగ్ మూవీ ఐడెంటిటీ కూడా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. మలయాళం లో ఈ సినిమాకు డీసెంట్ టాక్‌ వచ్చింది.  ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు మంచి టాక్ వస్తుందని నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు .. ప్రేమలు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మమిత బైజు డియర్ కృష్ణకు భారీ ప్రమోషన్లు చేసింది .. కానీ ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదని బుకింగ్స్ లో కనిపిస్తుంది.  ఈ సినిమా స్టోరీ అయితే డిఫరెంట్ గానే కనిపిస్తుంది . ఇదే క్రమంలో మరో చిన్న సినిమా తల్లి మనసులో నటించే ఆర్టిస్టులు ఎవరో కూడా ప్రేక్షకులు అసలు గుర్తుపట్టలేకపోతున్నారు .. హాలీవుడ్లో మంచి విజయం సాధించిన ‘హాంగ్ కాంగ్ వారియర్స్’ కు పబ్లిసిటీ గట్టిగానే జరిగింది .  అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్ బాలీవుడ్ లో మాత్రమే రిలీజ్ అవుతుంది.

 

ఇలా ఎన్ని సినిమాలు రిలీజ్ కి ఉన్న చివరిది తప్పించి మిగిలిన వాటి అడ్వాన్స్ బుకింగ్స్‌ చాలా నీరసంగా ఉన్నాయి.  మళ్లీ వీకెండ్ లో కూడా సంక్రాంతికి వస్తున్నాం , డాకు మహారాజ్ మళ్లీ పికప్ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి .. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు సాధారణ స్థితికి వచ్చేసాయి కాబట్టి కలెక్షన్లు మరింత పరుగుతాయని కూడా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఫిబ్రవరి 7 నాగచైతన్య తండేలు సినిమా వచ్చేదాకా బాక్సాఫీస్ దగ్గర పెద్ద‌గా మార్పు వచ్చేలా కనిపించడం లేదు .. ఒకవేళ పైన చెప్పన సినిమాల్లో ఏదైనా మంచి టాక్ వస్తే ఓకే కానీ లేదంటే ఎక్కువ శాతం థియేటర్లు ఖాళీగా కనిపించేలా ఉన్నాయి .. అయినా ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం చిన్న సినిమాలుకు పెద్ద సవాల్గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: