తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది పూనమ్ కౌర్.. తన అందంతో అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాల అవకాశాల కంటే కాంట్రవర్సీల విషయంలోనే ఎక్కువగా పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా మా అసోసియేషనన్లో టాలీవుడ్ డైరెక్టర్ పైన ఫిర్యాదు చేస్తే ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదంటూ ఫైర్ అయ్యింది. మా అసోసియేషన్ కు పూనమ్ కౌర్ ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదంటూ మా అసోసియేషన్లో ఒకరైన  శివబాలాజీ కూడా ఇటీవలే తెలియజేశారు. ఆమె పోలీసులను లేదా మా అసోసియేషన్ లోకి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఏదైనా చర్యలు తీసుకుంటామంటూ ఇలా సోషల్ మీడియాలో ట్విట్ చేస్తే లాభం లేదంటూ తెలిపారు.



అయితే తాజాగా పూనమ్ కౌర్ మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకోవడం జరిగింది.. ఓ అసోసియేషన్ గా అన్ని విషయాలను సైతం పరిగణంలోకి తీసుకోవాలని అందరి వాదనలు కూడా వినాలని తెలియజేసింది. కనీసం తన వాదన ఎవరు వినలేదని తాను చెప్పింది విని తనది తప్పు ఒప్పో చెప్పాలి అంటూ కూడా తెలియజేసింది పూనమ్ కౌర్.. ఇలాంటి విషయం వల్ల తన కుటుంబం కూడా చాలా బాధపడిందని తన తల్లి కూడా చాలా విసిగిపోయిందని తెలియజేసింది పూనమ్ కౌర్.


తనకు పొలిటికల్స్ అంటే తెలియవు తనను ఎంతో మంది చాలా రకాలుగా విమర్శించారని తాను ఏనాడు బాధపడలేదు రాద్ధాంతం చేయలేదు.. తాను సానుభూతి కోసం రాలేదని సమస్యను పరిష్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చానని తాను కూడా ఒక మహిళను ఈ మహిళ సమస్యను మహిళా సభ్యురాలతోనే మాట్లాడానని ఆమె ఝాన్సీ అని స్వయంగా తెలియజేసింది పూనమ్ కౌర్.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి పూనమ్ కౌర్ చెప్పినటువంటి ఈ విషయాలను పరిగణములోకి తీసుకొని విచారణ చేస్తారేమో మా అసోసియేషన్ చూడాలి. లేకపోతే ఈసారి కూడా సైలెంట్ అవుతారా ఏంటన్నది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: