తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని డైరెక్టర్ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది జక్కన్న మాత్రమే. కానీ అదే ప్లేస్ ను, మరో డైరెక్టర్ కూడా సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది తప్ప ఫ్లాప్ అనే మాట ఎరగదు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే ది గ్రేట్ అనిల్ రావిపూడి.. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన  తన టాలెంట్ ను నమ్ముకొని చివరికి డైరెక్టర్ గా మారాడు. అలాంటి అనిల్ రావిపూడి నిజజీవితంలో సినిమాలను మించిన లవ్ స్టోరీ ఉందట.. లవ్ లో చాలా ట్విస్టులు ఉన్నాయట.. అవేంటో చూద్దాం.. అనిల్ రావిపూడి  ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతోంది. ఇందులో 8 సినిమాలు తీస్తే 8 సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఆయన డైరెక్టర్ గా మారకముందు రైటర్ గా  చాలా సినిమాలకు పనిచేశారట. 

అలాంటి అనిల్ రావిపూడి 2005లో గౌతమ్ ఎస్ఎస్సి అనే సినిమా ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ గా మారారంట. అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి డైరెక్టర్ గా ఎందుకు చేయకూడదని ఆలోచన చేసుకొని మొట్టమొదటిసారిగా  నందమూరి కళ్యాణ్ రామ్ తో పటాస్ అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారట. అప్పటికే ఫ్లాపులతో సతమతమవుతున్న కళ్యాణ్ రాముకు బూస్టింగ్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమా హిట్టుతో తాను కూడా ఇండస్ట్రీలో  ఓ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత సరిలేరు నీకెవ్వరు, రాజా ది గ్రేట్, ఎఫ్2, సుప్రీం, ఎఫ్ 3,  భగవంతు కేసరి, సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రాల ద్వారా బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నాడు. అలాంటి డైరెక్టర్ లవ్ స్టోరీ వింటే అవాక్కు అవ్వాల్సిందే.. అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లవ్ స్టోరీ గురించి బయట పెట్టారు..

తన భార్య పేరు భార్గవి అని చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి కాలేజీలో చదివే సమయంలో నలుగురు అమ్మాయిలు ఉండేవారని ఆ నలుగురిలో నేను ఒక అమ్మాయిని చాలా లవ్ చేశానని, కానీ ఆమెకు అనూహ్యంగా పెళ్లి కావడంతో, తన ఫ్రెండునే పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.. అయితే నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి కాగానే, ఆమె ఫ్రెండ్ భార్గవి నా వద్దకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టమని ప్రపోజ్ చేసింది. దీంతో నేను చేసేదేమీ లేక ఆమెతో కమిట్ అయిపోయాను. చివరికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని ఆమె పేరు భార్గవి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు..

మరింత సమాచారం తెలుసుకోండి: