రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమే తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రామ్ చరణ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను చేశాడు. రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాకు కోలివుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న అభిమానుల ముందుకు థియేటర్లలో రిలీజ్ అయింది. 

కానీ గేమ్ చేంజర్ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ భారీగానే కలెక్షన్లు వచ్చాయి. కాగా, గేమ్ చేంజర్ విడుదలైన మొదటి రోజు.... ఏకంగా రూ. 186 కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టింది. అనంతరం అనుకున్న రేంజ్ లో కలెక్షన్లు రాలేకపోయాయి. ఇక గేమ్ చేంజర్ సినిమా 13వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే....


తెలుగు రాష్ట్రాలలో రూ. 0.59 కోట్లు, హిందీలో రూ. 25 లక్షలు, తమిళ్ లో రూ. 8 లక్షలు, కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 12 లక్షల చొప్పున మొత్తంగా కలిపితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 1.1 కోట్ల వసూళ్లని మాత్రమే రాబట్టింది. దీంతో గేమ్ చేంజర్ సినిమా 12 రోజులలో ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ. 128.84 వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


కాగా, గేమ్ చేంజర్ సినిమాకు వచ్చిన కలెక్షన్లకు సంబంధించి నిర్మాత దిల్ రాజు తనకు వచ్చిన నష్టం గురించి వెల్లడించారు. ఇంతవరకు కేవలం రూ. 150 కోట్లు మాత్రమే లాస్ వచ్చిందని చిత్ర బృందం అనుకున్నారు. కానీ 200 కోట్లు లాస్ వచ్చిందని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తేల్చి చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: