టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ లో ఓవైపు యాంకర్ గా చేస్తూనే.... మరోవైపు వివిధ ప్రోగ్రామ్ లలో తన హోస్టింగ్ తో అదరగొట్టింది. ఓవైపు షోలలో హోస్టింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలోను అవకాశాలను దక్కించుకుంది.


తన అద్భుతమైన నటన, అందంతో ఎన్నో సినిమాలలో అవకాశాలను దక్కించుకున్న ఈ చిన్నది ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. రీసెంట్ గా అనసూయ భరద్వాజ్ పుష్ప-2 సినిమాలోను కీలక పాత్రను పోషించింది. కాగా, అనసూయ భరద్వాజ్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. కొంతమంది తన ఫోటోలకు పాజిటివ్ గా స్పందించగా.... మరి కొంత మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తారు. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేసింది. తాను బికినీ వేసుకున్న, చీర కట్టుకున్న తన భర్తనే ఏమి అనడని చెప్పింది.


అసలు తాను ఎలా ఉన్నా తన భర్త శశాంక్ భరద్వాజ్ అసలు పట్టించుకోడని అనసూయ చెప్పింది. నా భర్త సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉంటుందని అనసూయ అన్నారు. నా భర్తకు లేని ఇబ్బంది మీకేంటి అంటూ కాస్త సీరియస్ అయ్యింది. నా మీద కామెంట్ చేయడానికి మధ్యలో మీరెవరు అంటూ అనసూయ హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: