టాలీవుడ్ హిట్ జోడీ అంటే మొదట గుర్తు వచ్చేది స్టార్ హీరో విక్టరీ వెంకటేష్- అందాల భామ సౌందర్య. వీరిద్దరూ సినిమా తీశారంటే చాలు.. హౌస్ ఫుల్ అయ్యేది. సౌందర్య, వెంకటేష్ జోడీని ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు. జంట అంటే ఇలా ఉండాలి అనుకునేలా ఉండేది వీరి కాంబో. ఇటీవల విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండగ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సంక్రాంతికి కానుకగా వచ్చిన ఈ మూవీ హ్యాట్రిక్ కొట్టేసింది. ఈ సినిమాలో హీరోయిన్లు గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గ్రాండ్ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ప్రమోషన్ లో దుమ్ము లేపిన ఈ చిత్రం.. ఇప్పుడు రిలీజ్ అయ్యి కూడా దుమ్ము లేపుతుంది. ఇక ఈ సినిమా నుండి వచ్చిన 'గోదావరి గట్టు మీద రామచిలకవే' సాంగ్ అయితే ఒక ఊపు ఉపేసింది. ఇక ఈ పాట ఈ సినిమాకు మరింత హైప్ తెచ్చిపెట్టింది. అయితే ఈ పాటకు వెంకటేష్ తో సౌందర్య డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు.. వేరే లెవెల్ ఉంటుంది కదా. చాలా మందికి ఈ కోరిక ఉండే.. అయితే ఓ అభిమాని వెంకటేష్, సౌందర్య కలిసి ఈ పాటకు డాన్స్ చేసినట్లు వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలోని ఓలమ్మీ తిమ్మిరి ఎక్కిందే పాటలోని స్టెప్పులను ఎడిట్ చేసి ఈ పాటకు పెట్టాడు. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ఎడిట్ కి నిమిషాల్లో మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. కొందరు అభిమానులు అయితే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: