నిర్మాత దిల్ రాజకు బిగ్ షాక్ తగిలింది. సినీ ప్రముఖుల ఇళ్లలో గత మూడు రోజుల నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో దిల్ రాజుకు షాక్ ఎదురైంది. దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. హుటా హుటిన కుటుంబ సభ్యులు దిల్ రాజు తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కాగా, గత మూడు రోజుల నుంచి సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, మ్యాంగో సంస్థ, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలలో ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. 

పలు సంస్థలకు చెందిన వ్యాపారాలు, లావాదేవీల పత్రాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడాలు ఉన్నట్లుగా ఐటి అధికారులు గుర్తించారు. దిల్ రాజుకు భారీగా ఆస్తులు ఉన్నట్లుగా ఐటి అధికారులు అనుమానంతోనే దాడులు నిర్వహించారని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యి భారీగా లాభాలను సంపాదించాయి.


వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజెర్ సినిమాలు పాజిటివ్ టాక్ తో దోసుకుపోయాయి. గేమ్ చేంజర్ సినిమాకు పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ సంక్రాంతి వస్తున్నాం సినిమా ద్వారా దిల్ రాజుకు భారీగానే లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. ఈ కారణంగానే దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా, ఈ దాడుల కారణంగానే దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారని సమాచారం అందుతుంది.


మూడు రోజు రోజుల నుంచి దిల్ రాజు తల్లి అనారోగ్యం బారిన పడ్డారు. ఈ క్రమంలోనే ఈరోజు ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించడంతో ఐటీ శాఖకు సంబంధించిన వాహనంలోనే దిల్ రాజు తల్లిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దిల్ రాజు తల్లితో పాటు కుటుంబ సభ్యులతో సహా ఐటీ శాఖకు చెందిన ఓ మహిళ అధికారి కూడా వెళ్లారు. దిల్ రాజు తల్లి ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: