సిల్క్ స్మిత బయోపిక్ ఎప్పుడు వచ్చినా కూడా ఒక సంచలనంగానే ఉంటుంది. ఇప్పటికీ ఈమె ఆత్మహత్యకు గల కారణం ఏంటి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు. అయితే తాజాగా సిల్క్ స్మిత కి సంబంధించి ఏఐ జనరేటర్ వీడియో ఒకటి వైరల్ గా మారుతున్నది. అప్పటి తరం ప్రేక్షకులకే కాకుండా ఇప్పటి తరం ప్రేక్షకులకు కూడా ఈమె ఒక అద్భుతమైన నటి అన్న వాటికి నిదర్శనంగానే నిలిచింది. తాజాగా వైరల్ గా మారుతున్న ఏఐ జనరేటర్ వీడియోలో సిల్క్ స్మిత నేటి ఫ్యాషన్ కి సినిమా ట్రెండుకు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ ని ఆహారాన్ని సైతం పద్ధతులను వేషధారణను చాలా అద్భుతంగా చూపించారు.
సిల్క్ స్మిత హాలీవుడ్ ,టాలీవుడ్ ,బాలీవుడ్ ఇలా ఎన్నో పాత్రలను ఇందులో చూపించడం జరిగింది. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉందంటూ పలువురు నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు సిల్క్ స్మిత సూపర్ ఉమెన్ గా, బాక్సర్ గా ఎన్నో పాత్రలలో తన అందాలతో మరింత హైలెట్గా చేస్తోంది ఏఐ. ఇప్పటికే సిల్క్ స్మిత బయోపిక్ ఆధారంగా చాలా సినిమాలు రావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఒక బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సిల్క్ స్మిత మరణించి ఇప్పటికీ ఎన్నో ఏళ్ళు అయినా ఈమె గురించి ఇప్పటికీ ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంది.