బాహుబలి2 సినిమా అటు ప్రభాస్ కెరీర్ కు ఇటు రాజమౌళి కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయింది. బాహుబలి2 సినిమా అప్పట్లోనే 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే మాత్రం ఈ మూవీ రేంజ్ మరింత పెరిగేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాహుబలి2 సినిమాతో రాజమౌళి బాక్సాఫీస్ చరిత్రనే మార్చేశాడనే చెప్పాలి.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ కు పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సైతం తను హీరోగా తెరకెక్కిన ప్రతి సినిమాలో లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ ఎప్పుడు సాధ్యమవుతుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ జక్కన్న కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ మామూలుగా లేదనే సంగతి తెలిసిందే. జక్కన్న ప్రస్తుతం మహేష్ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత రాజమౌళి ఏ స్టార్ హీరోతో సినిమాను ప్లాన్ చేస్తారో చూడాల్సి ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.