అయితే ఆది సినిమా తెరకెక్కడానికి ముందు ఒకింత పెద్ద కథే నడిచింది. మొదట వినాయక్ చెప్పిన కథ ఒకటి కాగా ఆ కథ నచ్చినా మాస్ ఇమేజ్ ను కోరుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరో కథను సిద్ధం చేయమని కోరారు. ఆ సమయంలో వినాయక్ తను ఎప్పుడో రాసి పెట్టుకున్న రెండు సీన్లతో ఆది కథను సిద్ధం చేశారు. ఆ రెండు సీన్లలో ఒకటి చిన్న పిల్లాడు బాంబులు వేసే సీన్ కాగా మరొకటి సుమోలు గాలిలోకి ఎగిరే సీన్.
ఈ రెండు సీన్లు సినిమాలో అద్భుతంగా పేలాయి. ఈ సినిమాకు ముందే జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో కొన్ని హిట్లు ఉన్నా తారక్ మాస్ ఇమేజ్, మాస్ హిట్ ను అందించిన సినిమా ఆది అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. దేవర సినిమా హిట్ తారక్ కు కెరీర్ పరంగా కలిసొచ్చింది.
దేవర సినిమా గురించి ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ బొమ్మగా నిలిచింది. ఎన్టీఆర్ వినాయక్ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నా ప్రస్తుతం వినాయక్ ఫామ్ లో లేకపోవడంతో ఈ కాంబోపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వినాయక్ మళ్లీ దర్శకుడిగా ప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.