టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తోనే మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత ఈయన జగడం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఈయన అనేక సినిమాలకు ఆ తర్వాత దర్శకత్వం వహించాడు. అందులో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

కానీ సుకుమార్ దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత నుండి రంగస్థలం మూవీ ముందు వరకు కూడా చాలా వరకు మామూలు యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలను , క్లాస్ మూవీలను మాత్రమే తెరకెక్కిస్తూ వచ్చాడు. మొట్ట మొదటి సారి సుకుమార్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన రంగస్థలం సినిమాలో మాస్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా సమంత నటించింది. ఈ సినిమాలో వీరిద్దరూ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేయడగా సుకుమార్ తన అద్భుతమైన దర్శకత్వం ప్రతిభతో ఈ సినిమాను బ్లాక్ బాస్టర్ వైపు తరలించాడు.

ఇకపోతే కెరియర్ లో మొట్ట మొదటి సారి ఊర మాస్ సినిమాను రూపొందించిన సుకుమార్మూవీ తో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిసింది. ఇక సుకుమార్ తాజాగా పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 అనే సినిమాలకు దర్శకత్వం వహించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: