సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు మాత్రం ఎక్సట్రోర్డినరీ అని చెప్పొచ్చు..ఏప్రిల్ 28,2006 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..అయితే ముందుగా ఈ సినిమాకు “ కృష్ణ మనోహర్ s/o సూర్య నారాయణ “ అనే టైటిల్ ని పరిశీలించినట్లు సమాచారం..కానీ ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన మెహర్ రమేష్ ఆ టైటిల్ ని పెడితే మూవీ ట్విస్టు రివీల్ అవుతుందని చెప్పడంతో వెంటనే పూరీ మనసు మార్చుకున్నారు.. ఇంట్రెస్టింగ్ టైటిల్ కోసం సెర్చ్ చేస్తుండగా మెహర్ రమేష్ “ పోకిరి” అనే టైటిల్ డిజైన్ చేసి ఇచ్చినట్లు సమాచారం.. అలా పోకిరి సినిమా సక్సెస్ మెహర్ అన్న హ్యాండ్ కూడా ఉంది..
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గోవా బ్యూటీ ఇలియానా అద్భుతంగా నటించింది.. ముందుగా ఈ భామని బదులు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ ఎంపిక చేశారట.. ఆమె ఆడిషన్ కూడా ఇవ్వగా పూరీ ఆమెని ఫిక్స్ చేసినట్లు సమాచారం..కానీ అదే సమయానికి బాలీవుడ్ “ గ్యాంగ్ స్టర్ “ మూవీలో ఆఫర్ రావడంతో కంగనా ఆ సినిమాకే ప్రిఫెరెన్స్ ఇచ్చింది.. అలా గోవా బ్యూటీ ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్ గా మారింది.. పూరీ సొంత నిర్మాణంలో తెరకెక్కిన పోకిరి సినిమా భారీగా లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా పూరీ స్టామినా ఏంటో ఇండస్ట్రీకి పరిచయం చేసింది.. అత్యధిక సెంటర్లలో ఈ సినిమా 200 రోజులకు పైగా ఆడింది.. పోకిరి సినిమా పూరీ కెరీర్ బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..