ఇప్పటికే దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్, మ్యాంగో మీడియా ,సుకుమార్ రైటింగ్స్ తో పాటు 15 మంది నిర్మాతల మీద మొత్తం దాడులు జరిగాయట. అలాగే ఫైనాన్షియర్ల పైన కూడా ఇలాంటి దాడులు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరందరి మధ్య ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనే విషయాలు అటు నిర్మాతలు, ఐటీ శాఖ మాత్రమే తెలియజేయాల్సి ఉన్నది. తాజాగా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న విషయం ఏమిటంటే ఐటి శాఖ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే విషయం కొత్త చర్చకు దారితీసింది.
అయితే ఈ చర్చలు నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవింద్ అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం థండెల్ సినిమాని నిర్మిస్తూ ఉండగా ఈ సినిమా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాని భారీ బడ్జెట్ తోనే నిర్మించామని చైతన్య కెరియర్ లోనే అత్యధికంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రాబడుతుందంటూ తెలిపారు. ఇక రెమ్యూనరేషన్ పరంగా కూడా చైతన్య ఎక్కువగానే తీసుకున్నారనే విషయాన్ని పరోక్షంగా చెప్పడం జరిగిందట. అయితే ఎక్కువ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇచ్చి హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ పైన ప్రకటించడం జరుగుతోందో వాటి మీద దాడి జరుగుతోందని వినికిడి ఎక్కువగా వినిపిస్తోంది. మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరన్నది చూడాల్సి ఉన్నది.