టాలీవుడ్ ఇండస్ట్రీ లో తిరుగులేని డైరెక్టర్ లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన పటాస్ అనే సినిమాతో దర్శకుడుగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు , భగవంత్ కేసరి తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వరుసగా 8 విజయాలను అందుకున్నాడు.

ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి , వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అద్భుతమైన రీతిలో థియేటర్లలో ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా ప్రమోషన్లను అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... భగవంత్ కేసరి ఒక అద్భుతమైన సినిమా. ఆ సినిమా రాంగ్ టైమ్ లో విడుదల అయింది అని నేను అనుకుంటున్నాను. ఆ సినిమా కనుక కరెక్ట్ టైమ్ లో విడుదల అయ్యి ఉంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఉండేది కావచ్చు అని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇకపోతే బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రీ లీల ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తన తదుపరి మూవీ ని మెగాస్టార్ చిరంజీవి తో చేయబోతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ విషయాన్ని చాలా సార్లు చాలా సందర్భాలలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: