ఒక మెగా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోకి ఇలాంటి పరిస్థితి ఏంది..? అంటూ చాలామంది మాట్లాడుకున్నారు . ప్రజెంట్ వరుణ్ తేజ్ తో సినిమాలను తెరకెక్కించడానికి ఏ డైరెక్టర్ కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు . అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో రామ్ చరణ్ ..అంత పెద్ద స్టార్ అవ్వడానికి వరుణ్ తేజ్ చిన్న హీరో గానే మిగిలిపోవడానికి కారణం వరుణ్ తేజ్ తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలు అంటున్నారు జనాలు . వరుణ్ తేజ్ కెరియర్ స్టార్టింగ్ లో మంచి సినిమాలను చూస్ చేసుకున్నాడు .
అయితే ఆ తర్వాత ఆయన మెసేజ్ ఓరియెంటెడ్ డిఫరెంట్ షేడ్స్ అంటూ తన బాడీకి సూట్ అవ్వని పాత్రలను సైతం చూస్ చేసుకున్నాడు. ఆ కారణంగానే వరుణ్ తేజ్ కి హిట్స్ పడలేకపోయాయి అని .. రాంచరణ్ మాత్రం మెగా హీరో ఎలాంటి సినిమాలు చేస్తే జనాలు ఆదరిస్తారు .. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి కెరియర్ ముందుకెళ్తుంది అన్న విధంగా ఆలోచించి "మగధీర" లాంటి సినిమాలను చూస్ చేసుకున్నాడు అని .. అందుకే వరుణ్ తేజ్ లైఫ్ ఇలా చరణ్ లైఫ్ అలా మారిపోయింది అంటున్నారు. చరణ్ అనుకున్నట్లు డిఫరెంట్ షేడ్స్ అని కాకుండా వరుణ్ కొంచెం మెగా ఫ్యాన్ బేస్ ఆలోచించి అలాంటి సినిమాలు చూస్ చేసుకుని ఉంటే మాత్రం ఇప్పుడు ఆయన నిజంగానే అల్లు అర్జున్ - రామ్ చరణ్ కి మించిపోయే హీరో ఉండేవాడు ..ఆయన కటౌట్ అలాంటిది మరి ..బ్యాడ్ లక్ ఏం చేద్దాం..!