అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప-2 సినిమా చేసిన రికార్డులు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమా తాజాగా ఇండియాలోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది అని తెలుస్తోంది.మరి ఇంతకీ దంగల్ సినిమా రికార్డును బ్రేక్ చేసి పుష్ప టు ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించిందో ఇప్పుడు చూద్దాం.. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప -2 సినిమాలో అల్లు అర్జున్ రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే ఈ సినిమాలో కీలకపాత్రల్లో జగపతిబాబు, సునీల్, అనసూయ ఫహద్ ఫాసిల్ వంటి వాళ్ళు నటించారు. అలాగే ఈ సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ మూవీ మొదటి రోజే 294 కోట్లు కలెక్టు చేసి ఇండియాలోనే ఫస్ట్ రోజు ఇన్ని కోట్ల కలెక్షన్లు వసూళ్లు చేసిన మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 

ఇక ఆ తర్వాత ఈ సినిమా ఖాతాలో ఎన్నో రికార్డులు పడ్డాయి. అయితే తాజాగా మన ఇండియన్ హిస్టరీ లోనే ఎక్కువ వసూలు కలెక్ట్ చేసిన సినిమాగా పుష్ప టు రికార్డు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.ఇన్ని రోజుల వరకు దంగల్ సినిమా దాదాపు 2200 కోట్లు అలాగే బాహుబలి 2 సినిమా 1810 కోట్లు కలెక్ట్ చేసి హైయ్యెస్ట్ ప్లేసుల్లో టాప్ వన్,టు ప్లేసులో ఉన్నాయి.కానీ ఆ మధ్యకాలంలో పుష్పటూ బాహుబలి టూ రికార్డ్ ని క్రియేట్ చేసి సెకండ్ ప్లేస్లోకి వెళ్ళింది. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. పుష్ప టు మూవీ కలెక్షన్ల విషయంలో దంగల్ సినిమాని కూడా బ్రేక్ చేసింది అంటూ పుష్ప టుకి సంబంధించిన 2200 కలెక్షన్ల పోస్టర్ నీ రిలీజ్ చేశారు.. 

సౌత్ డిజిటల్ మీడియా అనే ఎక్స్ అకౌంట్లో పుష్ప టు కి సంబంధించి 2200 కోట్ల పోస్టర్ వైరల్ అవుతుంది. పుష్ప టు వరల్డ్ వైల్డ్ గా 2200 కోట్ల వసూలు కలెక్ట్ చేయడంతో ఈ విషయం తెలిసి చాలా మంది అల్లు అభిమానులతో పాటు సుకుమార్, చిత్ర యూనిట్ అందరూ సంబరాలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ పుష్ప టు సినిమా చిక్కుల్లో పడప్పటికీ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం మాత్రం మామూలు విషయం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: