నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా కే రాఘవేందర్రావు దర్శకత్వంలో చాలా సినిమాలు రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రూపొందిన సినిమాలన్నీ భారీ అంచనాల నడుమ విడుదల అయినా కూడా ఏ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోలేదు. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరో గా కే రాఘవేందర్రావు దర్శకత్వంలో అశ్విని దత్ భారీ బడ్జెట్ తో అశ్వమేధం అనే సినిమాను రూపొందించాడు.

మూవీ లో ఆ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న శోభన్ బాబు కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. మీన , నగ్మా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటించగా ... ఇళయరాజామూవీ కి సంగీతం అందించాడు. అశ్విని దత్ , బాలకృష్ణ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏకంగా మూడు కోట్ల బడ్జెట్ తో అశ్వమేధం సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని 1992 వ సంవత్సరం విడుదల చేశారు. బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా కావడం , ఆ మూవీ కి రాఘవేందర్రావు దర్శకత్వం వహించడం , అశ్విని దత్ ఏకంగా ఈ సినిమాను మూడు కోట్ల బడ్జెట్ తో రూపొందించడం వల్ల ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అలా భారీ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమాకు పరవాలేదు అనే స్థాయిలో టాక్ మాత్రమే వచ్చింది. దానితో ఈ మూవీ మంచి కలెక్షన్లను వసూలు చేసిన ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో రూపొందించడం వల్ల ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. అలా 1992 వ సంవత్సరం లోనే అశ్వమేధం మూవీ ని అశ్వినీ దత్ ఏకంగా మూడు కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: