ఈ సినిమా రిలీజ్ అయి... అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. బంగారం నిధుల గురించి.. అలాగే ఓ సామ్రాజ్యంలో జరిగే యుద్ధ వాతావరణం గురించి.. ఈ సినిమాలో క్లారిటీగా చెప్పారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాగే కార్మికుల గురించి కూడా ఇందులో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ సినిమాలో యష్ హీరోగా చేయగా... శ్రీనిధి శెట్టి హీరోయిన్గా చేశారు. అలాగే సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా చేయడం జరిగింది.
ఏప్రిల్ 14వ తేదీ 2022 సంవత్సరంలో ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు కన్నడ మలయాళం హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. దాదాపు 125 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. 125 కోట్లతో ఈ సినిమా తీస్తే... దాదాపు 1300 కోట్ల వరకు రాబట్టగలిగింది ఈ సినిమా. కేవలం ఇండియాలోనే 623 కోట్లు రాబట్టింది కే జి ఎఫ్ 2 సినిమా. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో 377 కోట్లు రాబట్టింది.
ఇలా ప్రపంచ వ్యాప్తంగా... 1300 కోట్లు... రాబట్టిన ఏకైక సినిమా కేజిఎఫ్ 2. చిన్న స్థాయి హీరోగా ఉన్న యష్ ను పాన్ ఇండియా హీరోగా చేసిన ఘనత ప్రశాంత్ నీల్ కు దక్కుతుంది. ఇక కే జి ఎఫ్ 2 సినిమాలో హీరో చివరకు చనిపోయినట్లు చూపించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. కానీ కేజీఎఫ్ 3 కూడా ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఆ సినిమా వస్తే కూడా 1000 కోట్లు పక్కా అని అంటున్నారు.