పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం ఒకింత సంచలనాలు సృష్టించాయి. పుష్ప ది రూల్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు బాహుబలి2 కలెక్షన్ల రికార్డులను సైతం బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప ది ర్యాంపేజ్ ఐటమ్ సాంగ్ కు జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.
 
పుష్ప2 సినిమాలో కిస్సిక్ సాంగ్ లో ఎవరు స్టెప్పులు వేసినా వాళ్లకు ఇంటర్నేషనల్ రేంజ్ లో క్రేజ్ వస్తుందని నేను ముందుగానే ఊహించానని దేవిశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు. శ్రీలీల పేరును తానే మేకర్స్ కు సూచించానని శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్ కాబట్టి ఆమెను ఎంపిక చేస్తే బాగుంటుందని తాను ఫీలయ్యానని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.
 
చాలామంది స్టార్ హీరోయిన్లు నా కంపోజిషన్ లోనే తొలిసారి స్పెషల్ రోల్స్ లో నటించారని ఆయన చెప్పుకొచ్చారు. కాజల్, శ్రీలీల, సమంత టాప్ రేంజ్ లో ఉన్న సమయంలోనే ఐటమ్ సాంగ్స్ లో నటించారని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. జాన్వీ కపూర్ లో శ్రీదేవిలో ఉన్న గ్రేస్ ఉందని పుష్ప3 సాంగ్ కు ఆమె పర్ఫెక్ట్ అని నేను ఫీలవుతున్నానని దేవిశ్రీ ప్రసాద్ కామెంట్లు చేయడం గమనార్హం.
 
పుష్ప3 మూవీ షూట్ మొదలవ్వడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. ఆ సమయానికి కొత్త హీరోయిన్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. పుష్ప ది ర్యాంపేజ్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ఈ సినిమా 3000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప3 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం సినీ అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: