మాస్ మహారాజా రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం భద్ర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాలను విడుదల అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ స్టార్ట్ కావడానికి ముందు అనేక ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.

బోయపాటి శ్రీను "భద్ర" సినిమాతోనే దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఇకపోతే భద్ర సినిమా కథ మొత్తం తయారు అయిన తర్వాత ఈ మూవీ కథను దిల్ రాజుకు వినిపించగా ఆయనకు ఈ మూవీ స్టోరీ అద్భుతంగా నచ్చిందట. దానితో మొదటగా ఈ స్టోరీ అల్లు అర్జున్ తో అయితే బాగుంటుంది అని ఉద్దేశంతో ఆయనకు వినిపించారట. కథ మొత్తం విన్న అల్లు అర్జున్ స్టోరీ సూపర్ గా ఉంది కానీ నేను ప్రస్తుతం ఆర్య సినిమా చేయాలి అనుకుంటున్నాను. మీరు ఇదే కథతో , వేరే హీరోతో సినిమా చేయండి అని సలహా ఇచ్చాడట. దానితో చేసేదేమీ లేక మరో హీరో కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారట.

అందులో భాగంగా దిల్ రాజు ఈ మూవీ కథను జూనియర్ ఎన్టీఆర్ కి కూడా వినిపించాడట. కథ మొత్తం విన్న జూనియర్ ఎన్టీఆర్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఆ కథ రవితేజకు అయితే బాగా సూట్ అవుతుంది అనే ఉద్దేశంతో దిల్ రాజు ఈ మూవీ కథను రవితేజకు వినిపించగా ఆయన మాత్రం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఈ మూవీ కథలో రవితేజ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: