టాలీవుడ్ లో అంతగా మార్కెట్ లేని నాగశౌర్య నిజంగానే 40 కోట్లు మింగేసారా.. నాగ శౌర్య పై నిజంగానే నిర్మాతలు గుర్రుగా ఉన్నారా.. ఇంతకీ నాగ శౌర్య చేసిన పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..యంగ్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నాగశౌర్యకి ఇండస్ట్రీలో అంత మార్కెట్ అయితే లేదు.కానీ ఈయన్ని నమ్మి ఆ నిర్మాతలు మాత్రం ఏకంగా 40 కోట్ల వరకు పెట్టారట. మరి ఇంతకీ అసలు విషయం ఏంటయ్యా అంటే.. నాగశౌర్య బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన బ్యాడ్ బాయ్ కార్తీక్ అనే సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే ఈ మూవీకి ఇప్పటికే ఒక డైరెక్టర్ ని మార్చేసారట నాగశౌర్య.. బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీకి మొదట వర్మ ని డైరెక్టర్గా తీసుకున్నారు నిర్మాతలు.అయితే ఈ సినిమా కొంచెం పూర్తయ్యాక సినిమా అవుట్ పుట్ బాలేదని నాగశౌర్య ఏకంగా డైరెక్టర్ నే పక్కన పెట్టమని నిర్మాతలకు చెప్పారట.దాంతో హీరో చెప్పడంతో చేసేదేమీ లేక వర్మ ని తీసేసారట.

ఆ తర్వాత హీరో నాగ శౌర్య రమేష్ అనే కొత్త డైరెక్టర్ని ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకున్నారు. దాంతో ఈ సినిమాని తెరకెక్కించే బాధ్యత రమేష్ చేతుల్లో పెట్టారు. అయితే ఇప్పటికే 70% పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని డైరెక్టర్ రమేష్ నాగశౌర్య ఇప్పటికి కూడా నిర్మాతలకి చూపించడం లేదట. తాజాగా నాగశౌర్య బర్త్ డే సందర్భంగా బ్యాడ్ బాయ్ కార్తీక్ కి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ చూడడానికి అంత ఆసక్తికరంగా లేదని కొంతమంది అంటున్నారు. బ్యాడ్ బాయ్ కార్తీక్ కాదు బ్యాడ్ బాయ్ నాగ శౌర్య అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే నాగశౌర్య విషయంలో నిర్మాతలు మాత్రం గుర్రుగా ఉన్నారట.ఎందుకంటే ఇప్పటికే మొదటి డైరెక్టర్ వర్మ కారణంగా 10 కోట్లు నష్టపోయారట నిర్మాతలు. ఇప్పుడు కొత్త డైరెక్టర్ రమేష్ ని నమ్మి 30 కోట్ల వరకు ఖర్చు చేశారట.అలా 40 కోట్ల వరకు ఈ సినిమాకి బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తోంది.

 అయితే నాగశౌర్యకి ఇండస్ట్రీలో ఎంత మార్కెట్ ఉందో చెప్పనక్కర్లేదు.అలాంటి ఈ హీరోని నమ్మి ఇప్పటికే 40 కోట్లు ఖర్చు పెట్టారంటే నిర్మాతల ధైర్యం అనే చెప్పాలి. ఒకవేళ సినిమా బోల్తా కొడితే మాత్రం నిర్మాతల పని అయిపోయినట్టే. ఇక ఈ సినిమా ఇప్పటికే ఇద్దరు డైరెక్టర్ల చేతులు మారడంతో సినిమా అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో అని నిర్మతల్లో కూడా భయం ఉందట.ఇక ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టడంతో ఈ సినిమాని కొనడానికి కూడా డిస్ట్రిబూటర్లు వస్తారో రారో నమ్మకం తక్కువ.అందుకే నిర్మాతలు 40 కోట్లు ఖర్చు చేసి తప్పు చేసామా అని లోలోపల మదన పడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ నీ పని నువ్వు చేసుకోక డైరెక్షన్ విషయంలో నువ్వు ఎందుకు వేలు పెట్టావయ్యా.. ఇదేం పద్ధతి అంటూ ఏకపారేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి నాగశౌర్య మూవీకి 40 కోట్ల బడ్జెట్ అంటే సాహసం అనే చెప్పుకోవాలి.మరి చూడాలి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది

మరింత సమాచారం తెలుసుకోండి: