తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మనులకో నిత్యా మీనన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం నితిన్ హీరో గా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఇష్క్ అనే సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది. దానితో వరుస పెట్టి ఈమెకు తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం , అందులో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈమె క్రేజ్ చాలా వరకు పెరిగింది.

ఇక కేవలం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ వస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం నిత్యా మీనన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ నాకు సినిమాల్లో నటించాలని అస్సలు లేదు. ఇప్పటికిప్పుడు సినిమాలు మానేయాలని ఉంది అని షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాజాగా నాకు సినిమాలు మానేయాలి అనే ఆలోచన రావడానికి ప్రధాన కారణం స్వేచ్ఛ లేకపోవడం. నేను నటి కావడం వల్ల  నాకు క్రేజ్ ఉండడం వల్ల , నేను అందరికీ తెలియడం వల్ల నేను బయటకి ఎక్కడికి వెళ్లినా కూడా నా చుట్టూ జనాలు గుమ్మి గూడా తారు. ప్రశాంతంగా బయట తిరగనివ్వరు. ఎక్కడికి వెళ్లినా మనుషులు అంతా నన్నే చూస్తూ ఉంటారు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే నాకు సినిమాలు మానేయాలనిపిస్తుంది అని నిత్యా మీనన్ చెప్పకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: